Heroes : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక పాన్ ఇండియాలో చేస్తున్న సినిమాలన్నింటిలో మన తెలుగు దర్శకులు చేసిన సినిమాలకే ఎక్కువ క్రేజ్ లభించడం, భారీ వసూళ్లను రాబట్టడం చూస్తున్న ఇతర భాషల హీరోలు సైతం మన వాళ్ళతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు… అందుకే మన దర్శకులకు భారీ డిమాండ్ అయితే ఏర్పడింది…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో సూర్య (Surya)… గజినీ(Gajini) సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ సినిమా తెలుగులో డబ్ అవ్వడం వల్ల తెలుగులో కూడా అతనికి చాలా మంచి గుర్తింపైతే లభించింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. వైవిధ్య భరితమైన పాత్రలను చేయడంలో సూర్య ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు సూర్య చేసిన సినిమాలన్నీ కూడా తెలుగులో సైతం మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇక దాంతో ఆయనకు తెలుగులో విపరీతంగా మార్కెట్ అయితే పెరిగింది. తెలుగు స్టార్ హీరోలతో పోటీ పడుతూ మరి ఆయన సినిమాలు ఇక్కడ భారీ వసూళ్లను రాబడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి సందర్భంలోనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గతంలో త్రివిక్రమ్(Trivikram), సూర్య (Surya) కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. కానీ అది ఎప్పుడూ సెట్స్ మీదకి వెళుతుంది అనే దానిమీదనే చాలా వరకు కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇప్పటికే వెంకీ అట్లూరి (Venky Atluri), చందు మొండేటి (Chandu Mondeti) లాంటి దర్శకులు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక వీళ్లతో పాటుగా తెలుగులో ఉన్న యంగ్ డైరెక్టర్స్ సైతం తనతో సినిమాలు చేయడానికి కొన్ని అద్భుతమైన స్క్రిప్ట్ లను రెడీ చేసుకున్నారు. మరి వీళ్ళందరికి తను డేట్స్ ఇస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులతో తను భారీ ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేసినప్పటికి అవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించడం లేదు. దాంతో ఆయన తెలుగు దర్శకుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక తెలుగు వాళ్ళతో సినిమాలు చేస్తూ తనదైన రీతిలో ముందుకు సాగితే మాత్రం సూర్య తెలుగులో చాలావరకు సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక సూర్య ఏ పాత్రనైనా అలవోకగా నటించి మెప్పించగలుగుతాడు. కాబట్టి దర్శకులు సైతం మన స్టార్ హీరోల డేట్స్ దొరకపోతే సూర్య ను సెకండ్ ఆప్షన్ లో పెట్టుకొని అతనితో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read : ఈ సమ్మర్ కి పెద్ద హీరోలెవ్వరు రావడం లేదా..? వేసవిని లైట్ తీసుకుంటున్న స్టార్ హీరోలు…