https://oktelugu.com/

నాగార్జున పై ఇంద్రజ ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

బిగ్‌ బాస్‌ రియాల్టీ షోకి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగులో కూడా ఈ బిగ్‌ రియాల్టీ షోకి ఫుల్ క్రేజ్‌ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ షో ప్రతి సీజన్ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మరి ఇలాంటి షోలో పాల్గొనే అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోలేరు అనుకుంటాం. కానీ, ఈ షోను రిజక్ట్ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆ లిస్టులో మాజీ హీరోయిన్‌ ఇంద్రజ కూడా చేరింది. బిగ్‌ బాస్‌ నాల్గొ […]

Written By: , Updated On : April 24, 2021 / 09:11 AM IST
Follow us on

బిగ్‌ బాస్‌ రియాల్టీ షోకి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగులో కూడా ఈ బిగ్‌ రియాల్టీ షోకి ఫుల్ క్రేజ్‌ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ షో ప్రతి సీజన్ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మరి ఇలాంటి షోలో పాల్గొనే అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోలేరు అనుకుంటాం. కానీ, ఈ షోను రిజక్ట్ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆ లిస్టులో మాజీ హీరోయిన్‌ ఇంద్రజ కూడా చేరింది. బిగ్‌ బాస్‌ నాల్గొ సీజన్‌ లో ఇంద్రజకు అవకాశం వచ్చిందట. అయితే షోలో పాల్గొంటానికి ఆమె ఆసక్తి చూపించలేదట.

ఒకప్పుడు హీరోయిన్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ, ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా రాణించలేదు, అలాగే ఎలివేట్ అవ్వాల్సిన స్థాయిలో కూడా ఆమె హీరోయిన్ గా ఒక వెలుగు వెలగలేకపోయింది. ఇక గతకొద్ది కాలంగా సినిమాలలో తిరిగి నటించడానికి ఆసక్తి చూపిస్తోన్న ఇంద్రజ, ఇటీవల బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కామెడీ షోకి జడ్జీగా కూడా కనిపిస్తోంది. అయితే తాజాగా ఆమె ఓ చానెల్‌ కు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలోనే బిగ్‌ బాస్‌ షో పై తన మనసులోని మాటను మొత్తానికి బయట పెట్టింది ఈ సీనియర్ హీరోయిన్.

మరి ఇంద్రజ మాటల్లోనే “నిజానికి ‘బిగ్‌ బాస్‌’ నాల్గో సీజన్‌ లో నాకు ఆఫర్‌ వచ్చింది. కానీ అప్పుడు నేను రాలేనని వారికీ చెప్పాను. అయితే బి బాస్ లోకి వెళ్లలేకపోవడానికి కారణం ఆ షో పై నెగిటివ్ భావన ఉండటం వల్ల కాదు. నా ఫ్యామిలీ ఇప్పటికీ చెన్నైలో ఉంటుంది. నేను నా ఫ్యామిలీని వదిలి.. నెలలు తరబడి నేను వేరే ప్రపంచంలో ఉండలేను అందుకే బిగ్‌బాస్‌లోకి వెళ్లలేదు’ అని చెప్పుకొచ్చింది.

మరి భవిష్యత్తులో మళ్ళీ బిగ్ బాస్ నుండి అవకాశం వస్తే వెళ్తారా అని అడిగితే.. ‘అవకాశం వచ్చినా నెను వెళ్లను. అయితే గెస్ట్‌గా అవకాశం వస్తే మాత్రం వెళ్తాను. అది కూడా డబ్బులు కోసం కాదు. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్‌ నాగార్జునని చూడడానికే వెళ్తా’ అంటూ చిలిపి నవ్వు నవ్వింది. అన్నట్టు ఇంద్రజ నాగార్జునతో ఓ సూపర్ హిట్ సాంగ్ లో ఆడిపాడింది. ఇక ఇంద్రజకు నాగ్‌ హోస్టింగ్‌ చాలా బాగా అని అనిపిస్తోందట. నాగ్ ఇప్పటికీ స్టైలీష్‌గా, అందంగా ఉన్నారు’ అంటూ కింగ్‌ నాగార్జున పై పొగడ్తల వర్షాన్ని కురిపించింది ఇంద్రజ.