https://oktelugu.com/

Indraja and Aamani : మాజీ మాజీ హీరోయిన్స్‌ క్రేజీ కబుర్లు !

మాజీ హీరోయిన్స్‌ గా ఒకప్పుడు తెలుగు తెర పై అదరగొట్టిన ఆమని (Aamani), ఇంద్రజ ( indraja) కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, ఆ ఇంటర్వ్యూలో వీరిద్దరూ ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఇంద్రజ అసలు పేరు.. ‘ కనకలక్ష్మి ‘.ఆమె పుట్టినప్పుడు ఆమె నానమ్మగారి పేరు అయిన ‘కనకలక్ష్మి’ పేరునే ఆమెకు పెట్టారట. ఇక ఆమని గారి అసలు పేరు మంజుల అట. అలాగే ఆమని గారు తమిళ చిత్రాల్లో నటించే సమయంలో […]

Written By: , Updated On : September 1, 2021 / 03:46 PM IST
Follow us on

Indraja And Aamani Crazy Talksమాజీ హీరోయిన్స్‌ గా ఒకప్పుడు తెలుగు తెర పై అదరగొట్టిన ఆమని (Aamani), ఇంద్రజ ( indraja) కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, ఆ ఇంటర్వ్యూలో వీరిద్దరూ ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఇంద్రజ అసలు పేరు.. ‘ కనకలక్ష్మి ‘.ఆమె పుట్టినప్పుడు ఆమె నానమ్మగారి పేరు అయిన ‘కనకలక్ష్మి’ పేరునే ఆమెకు పెట్టారట.

ఇక ఆమని గారి అసలు పేరు మంజుల అట. అలాగే ఆమని గారు తమిళ చిత్రాల్లో నటించే సమయంలో మీనాక్షి అని పేరు పెట్టుకున్నారు. కానీ తెలుగు సినిమాలల్లో మాత్రం ఆమె ‘ఆమని’ పేరుతో బాగా పాపులర్ అయ్యారు. ‘జంబలకిడి పంబ’ సినిమా సమయంలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణగారు ఆమెకు ఆమని అని పెట్టి దీవించారు.

ఆమని ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి 90కు పైగా సినిమాలు చేశారు. ఇంద్రజ గారు కూడా ఇప్పటి వరకూ 90కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. తమిళ చిత్రాల్లో ఇంద్రజ చెల్లెలి పాత్రలు కూడా పోషించారు. ఇక ఆమని సినిమాల్లోకి వెళ్తానంటే చాలా విమర్శలు చేశారట. నువ్వు కలర్‌ తక్కువ. నీ జిడ్డు మొహానికి సినిమాలు ఎందుకే ? అంటూ హేళన చేశారట.

అందుకు తగ్గట్టుగానే ఆమనికు సిగ్గు ఎక్కువ. ఇంటికి ఎవరైనా మగవాళ్లు వస్తే.. వెంటనే గదిలోకి వెళ్లిపోయేది. అలాంటి ఆమని విచిత్రంగా సినిమాల్లోకి వెళ్తాను అంటే.. అందరూ షాక్ అవ్వడంతో పాటు పెద్దగా నవ్వారు. అయితే ఆమని మాత్రం ఎన్నో కష్టాలు పడి చివరకు హీరోయిన్‌ గా రాణించింది.

ఇక ఆమని తన సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘చూస్తుండగానే పాతికేళ్లు గడిచిపోయాయి. అఖిల్‌ తో మరోసారి నటిస్తున్నాను. ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’లో అఖిల్ కి తల్లిగా నటిస్తున్నాను. ప్రేమగా, ఆప్యాయంగా అఖిల్ నన్ను అమ్మా అని పిలుస్తాడు.