Telangana: ప్రత్యేక తెలంగాణ (Telangana) ఏర్పడ్డాక సమస్యలు ఎక్కువవుతాయని నిపుణులు అప్పట్లో హెచ్చరించారు. తెలుగు స్టేట్లు విడిపోయాక తెలంగాణ అనూహ్య రీతిలో ప్రగతి సాధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. 2014లో రాష్ర్టం అవతరించాక ఆర్థిక పరిస్థితి మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వృద్ధి రేటు పెరగడంతో అభివృద్ధి సాధ్యమైంది. దీంతో దేశంలోని స్టేట్లలో తెలంగాణ మరింత దూసుకుపోతోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశంలోని ప్రతిభావంతమైన రాష్ర్టంగా ఎదుగుతోంది.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టేట్లలో తెలంగాణ ఒకటిగా గుర్తింపు పొందుతోంది. జీఎస్డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ర్టంగా తెలంగాణ అవతరిస్తోంది. పారిశ్రామిక రంగంలో తన దైన శైలిలో దూసుకుపోతోంది. సంప్రదాయ రంగాల్లో కూడా రాష్ర్టం మరింత ముందుకు పోతోంది. ఫార్మారంగంలో కూడా తన ప్రతిభ నిరూపించుకుంటోంది.
పారిశ్రామిక ప్రగతిలో కూడా తెలంగాణ ఖ్యాతి ఇనుమడిస్తోంది. ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్ వాటా 20 శాతంగా ఉంటోంది. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా తనదైన శైలిలో ఎదుగుతోంది. టూరిజంలో కూడా తన ప్రభావాన్ని చూపిస్తోంది. హైదరాబాద్ లో భారీగా పరిశ్రమల ఏర్పాటు చేస్తుంది. దీంతో పరిశ్రమల పరంగా కూడా రాష్ర్టం తన బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రగతిపథం వైపు మాత్రం అడుగులు వేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. తెలంగాణ రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో రాష్ర్ట ప్రగతిపై పాలకులు సైతం తమ శ్రద్ధ కనబరుస్తున్నారు. పాలకుల పట్టింపుతోనే ఈ ప్రగతి సాధ్యమవుతోందని తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా వచ్చే ఫలితాల కోసం ఎదురు చూస్తోంది.