Bigg Boss 9 Telugu Grand Finale Voting: చూస్తూ ఉండగానే ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో క్లైమాక్స్ కి వచ్చేసింది. గత వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో రీతూ చౌదరి ఎలిమినేట్ అవ్వగా, ఇప్పుడు హౌస్ లో 7 మంది మిగిలారు. వీరిలో టాప్ 5 గా ఎవరు నిలుస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతానికి అయితే టాప్ 3 కంటెస్టెంట్స్ ఖరారు అయ్యారు. ఎవరెవరంటే తనూజ, పవన్ కళ్యాణ్ మరియు ఇమ్మానుయేల్. వీరిలో తనూజ , పవన్ కళ్యాణ్ లలో ఒకరు టాప్ 1 , మరొకరు టాప్ 2 గా నిలుస్తారు. ఇక ఇమ్మానుయేల్ అయితే టాప్ 3 స్థానానికే పరిమితం. టాప్ 4 మరియు టాప్ 5 గ ఎవరు నిలుస్తారు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ముగ్గురు కాకుండా మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ కి ఓటింగ్ సరిసమానంగా పడుతోంది.
కేవలం ఒకటి లేదా రెండు శాతం మాత్రమే తేడాతో ఉన్నారు ఈ నలుగురు. కానీ వీరిలో కాస్త బెస్ట్ ఓటింగ్ మాత్రం భరణి కి ఉంది. ఆన్లైన్ ఓటింగ్ లో కూడా ఆయనకు బలంగానే పడుతోంది. ఆన్లైన్ ఓటింగ్ కంటే కూడా ఆయనకు మిస్సెడ్ కాల్స్ ద్వారా టాప్ ఓటింగ్ పడుతుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఫ్యామిలీ ఆడియన్స్ లో భరణి కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యిందని, అందుకే ఆయన హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నాడని, మిగిలిన వారాల్లో ఆయన ఎప్పుడూ డేంజర్ జోన్ లోకి రాలేదని అంటున్నారు. ఇక భరణి తర్వాతి స్థానం డిమోన్ పవన్ ఉన్నట్టు సమాచారం. ఈయనకు ఆన్లైన్ ఓటింగ్ బలంగానే పడుతుంది కానీ, మిస్సెడ్ కాల్స్ ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు.
డిమోన్ పవన్ తర్వాత సంజన ఉన్నట్టు తెలుస్తుంది. డిమోన్ కి, సంజన కి మధ్య ఓటింగ్ లో అసలు తేడానే లేదంట. ఇద్దరికీ సరిసమానమైన ఓటింగ్ పడుతుందట. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరైనా టాప్ 5 లో ఉండొచ్చని సమాచారం. ఇక సుమన్ శెట్టి కి అయితే టాప్ 5 లో ఉండే అవకాశాలు సూన్యం అనే చెప్పాలి. గత వారం లో ఇతన్ని ఎలిమినేట్ చేయకుండా బాగా ఆడే రీతూ చౌదరి ని ఎలిమినేట్ చేసినప్పుడే ఆడియన్స్ నుండి తీవ్రమైన నెగిటివిటీ ఎదురైంది. ఇది సుమన్ శెట్టి ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ లో టాప్ 6 పెడుతారా?, లేదంటే టాప్ 5 పెడుతారా అనే విషయం పై క్లారిటీ లేదు. ఒకవేళ టాప్ 5 పెట్టి, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే కచ్చితంగా సుమన్ శెట్టి, సంజన, డిమోన్ పవన్ లలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు