‘నీలో గ్లామర్ లేదమ్మా.. నువ్వు మరీ సన్నగా, పీలగా ఉన్నావ్’, ‘అసలు నువ్వు అందగత్తెవేమీ కాదు కదా’ ఎందుకు తెగ ఉబలాట పడుతున్నావ్ ?’, ఇలా ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయితేనేం.. ఆ విమర్శలను తనకు మెట్లుగా మార్చుకుంది. తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ పోయింది. అందుకే, ఆమె నేడు విశ్వ వేదికగా విజేతగా నిలిచింది. ఆమె.. ‘హర్నాజ్ కౌర్ సంధు’.

పంజాబీ రాష్ట్రంలోని చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఈ 21 ఏళ్ల భామ, దాదాపు 21 సంవత్సరాల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తీసుకువచ్చి.. తాను ప్రత్యేకం అంటూ నిరూపించింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అసలు హర్నాజ్ కౌర్ సంధు ఎవరు ? ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చూద్దాం.
హర్నాజ్ సంధుకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఇష్టం. నిజానికి మోడల్ గా కంటే కూడా నటిగా మారాలని, వెండితెరపై వెలిగిపోవాలని ఆమె ఎన్నో కలలు అంటూ బతికింది. ఆ కలలను సాకారం చేసుకునే క్రమంలోనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మోడల్ గా ఎన్నో వేదికల పై తన తళుకులు చూపించి, అందాల భామగా ఎన్నోసార్లు మెరిసింది.

ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని ‘లివా మిస్ దివా యూనివర్స్’ కిరీటాన్ని దక్కించుకుని.. ఆ ఉత్సాహంతో విశ్వ సుందరి పోటీల్లోకి అడుగుపెట్టి.. దాదాపు 80 దేశాలకు చెందిన అందగత్తెలను వెనక్కి నెట్టి విశ్వ వేదికపై విజయకేతనం ఎగురవేసి.. నేడు ఇండియాకే పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. అన్నట్టు హర్నాజ్ కేవలం మోడల్ మాత్రమే కాదు, మంచి నటి కూడా.
Also Read: Shilpa Chaudhary: ‘కిలాడి’ శిల్పా చౌదరి ఇలా మారిపోయిందెంటీ?
ఆమె పంజాబీలో తెరకెక్కిన పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక హర్నాజ్ తల్లి ఫేమస్ గైనకాలజిస్ట్. ఇక హర్నాజ్ పర్సనల్ విషయాలకు వస్తే.. ఆమె వయసు 21 సంవత్సరాలు, ప్రస్తుతం ఆమె పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేస్తున్నారు. హర్నాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. 2014లో ఫిబ్రవరి 14న ఆమె ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు.
Also Read: Celebratie Siblings: టాలీవుడ్ హీరో హీరోయిన్ల తోబుట్టువులు వీళ్లే..!