Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలోవస్తోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగం పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి, కొరటాల శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొరటాల శివ పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు.

సుకుమార్ ప్రస్తుతం ఇక్కడకు రాలేకపోయాడు కాబట్టి ఆయన తరఫున నేను మాట్లాడుతున్నా అంటూ దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు బన్నీ ఈ సినిమా కోసం పడుతున్న కష్టానికి ప్రశంసలు కురిపించారు.అల్లు అర్జున్ కఠోర శ్రమతో కెరీర్లో కొత్త శిఖరాలను చేరుకున్నాడని అన్నారు. అతనికి అంకితభావం, కష్టపడే స్వభావం పుష్కలంగా ఉన్నాయని.. సినమా కోసం బన్నీ పెట్టే డెడికేషన్ చూస్తుంటే.. ఎలాంటి కథలు రాయాలో అర్థమవుతోందని అన్నారు. త్వరలోనే పుష్ప కంటే పెద్ద కథతో నీ దగ్గరకు వస్తా బన్నీ.. అంటూ చెప్పుకొచ్చారు.
ఒక నటుడిని అది కూడా నీలాంటి వ్యక్తిని ఏ రేంజ్లో చూపించొచ్చనేది బాగా ఆలోచించుకుని, స్క్రిప్ట్ రెడీ చేసి సంప్రదిస్తానని కొరటాల ఈవెంట్లో స్పష్టం చేశారు. దీంతో బన్నీ, కొరటాల కాంబోలో సినిమా గ్యారంటీ అనీ అందరూ ఫిక్స్ అయ్యారు. కాగా, పుష్ప సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబరు 17న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.