CM`s : ఎక్కువ క్రిమినల్‌ కేసులు ఉన్న సీఎంలు, మాజీలు వీరే..!

– ఇక క్రిమినల్‌ కేసులు ఉన్న సీఎంలలో 5వ స్థానంలో ఉన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌. ఇతనిపై 13 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

Written By: NARESH, Updated On : May 21, 2024 10:18 am
Follow us on

CM`s criminal cases : దేశంలో రాజకీయాలకు అర్థం మారుతోంది. ఒకప్పుడు ప్రజాసేవ, పార్టీ, సిద్ధాంతాలు, నిస్వార్థం అనే భావనతో నాయకులు ఉండేవారు. కానీ ఇప్పుడు సిద్ధాంతాలను గాలికి వదిలేశారు. ఇక ప్రజలకు సేవ చేయడం కూడా క్రమంగా వదిలేస్తున్నారు. నిస్వార్థం నేతల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. తమ అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలో కేసులపాలవుతున్నారు. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద లీడర్‌ అన్నట్లుగా మారిపోతున్నారు ప్రజాప్రతినిధులు. ఇక ముఖ్యమంత్రులు కూడా వీటికి అతీతం కాదు. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఎక్కువ కేసులు ఉన్న ఐదు గురు ముఖ్యమంత్రుల గురించి తెలుసుకుందాం

ఎక్కువ కేసులు ఉన్న సీఎంలు వీరే..
– దేశంలో అత్యధిక క్రిమినల్‌ కేసులు ఉన్న సీఎంలలో కేసీఆర్‌ ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇతను ఓడిపోయారు. అయితే ఇతనిపై 64 క్రిమిలన్‌ కేసులు ఉన్నాయి.

– క్రిమినల్‌ కేసులు ఎక్కువ ఉన్న సీఎంలలో రెండో స్థానంలో ఉన్నారు. తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్‌. ఈయనపై 47 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

– క్రిమినల్‌ కేసులున్న సీఎంలలో మూడో స్థానంలో ఉన్నారు ఏపీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. ఇతనిపై 38 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

– మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌షిండే.. క్రిమినల్‌ కేసులు ఉన్న సీఎంలలో 4వ స్థానంలో ఉన్నారు. ఈయనపై 18 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

– ఇక క్రిమినల్‌ కేసులు ఉన్న సీఎంలలో 5వ స్థానంలో ఉన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌. ఇతనిపై 13 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.