The Greatest India vs Pakistan Rivalry
The Greatest India vs Pakistan Rivalry : ఇండియా ఏ మంచి పని చేసిన కూడా పాకిస్తాన్ ఓర్వలేకపోతుంది. ఇక ఇండియాను ఏదో ఒక రకంగా దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది…మరి ఇదిలా ఉంటే పాకిస్థాన్ చేసే చేష్టలకి వాళ్ల మీద మనకు వచ్చే కోపాన్ని మనం డైరెక్ట్ గా ఎదుర్కోలేము. కాబట్టి కనీసం క్రికెట్ రూపంలో అయినా వారిని చిత్తుగా ఓడించి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటు ఉంటారు. మరి ఇలాంటి ఒక మధురానుభూతిని పొందడానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘ది గ్రేటెస్ట్ ఇండియా – పాకిస్తాన్ రైవలరీ అనే ఒక డాక్యుమెంటరీ ని రెడీ చేసింది…ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దానికి ప్రపంచంలోనే అత్యధిక వ్యూయర్ శిను సంపాదించడమే కాకుండా అత్యధికంగా రెవెన్యూ ని కూడా వసూలు చేసే మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనే చెప్పాలి… ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు మూడు ఎపిసోడ్లతో కూడిన ఒక డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రేక్షకుల ముందు ఉంచింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అవలేబుల్ లో ఉన్న ఈ డాక్యుమెంటరీని అభిమానులు ఆసక్తిగా చూస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే 2004వ సంవత్సరంలో ఐదు వన్డేలు, మూడు టెస్టు సిరీస్ ల్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఒక బీకరమైన పోరాటమైతే జరిగింది. టెస్టు మ్యాచ్ లో 295 స్కోర్ వద్ద వీరేంద్ర సెహ్వాగ్ సిక్స్ కొట్టి ట్రిపుల్ సెంచరీ మైలురాయిని అందుకున్న సంఘటన మనం ఎప్పటికి మర్చిపోలేము.
అలాగే షోయబ్ అక్తర్ ఇండియన్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టే విధంగా వేసిన స్పెల్ కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇక లక్ష్మిపతి బాలాజీ సిక్స్ కొట్టి అక్తర్ చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పిన సంఘటన మనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాం…
మరి అలాంటి గొప్ప గొప్ప మధురానుభూతులను మరోసారి మన ముందుకు తీసుకురావడానికి నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీ రూపొందించింది. మరి దీనిని చూసి ప్రతి ఒక్కరు మరోసారి ఒకప్పటి అనుభూతులను ఆనందించాలని వీరేంద్ర సేవాగ్ బ్యాటింగ్ ను చాలామంది మిస్సయిపోతున్నాం అంటూవరకు ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి ఈ డాక్యుమెంటరీ చూస్తే మరోసారి మన కళ్ళముందే విలయతాండవం చేస్తున్నాడు అని ఒక అనుభూతిని అయితే మనం పొందవచ్చు…
ఇక నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ డాక్యుమెంటరీని చూసి, ఇండియా పాకిస్తాన్ మ్యాచే కాదు డాక్యుమెంటరీ సిరీస్ గా వచ్చిన దానిని సక్సెస్ ఫుల్ గా నిలుపుతాము అంటూ మన ఇండియన్స్ ఉత్సాహాన్ని చూపించాలని కోరుకుందాం…