Most Followed On Instagram: సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంవతమైన మీడియా(Powerfull Media)గా ఎదిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అనేకం ఉన్నా సామాజిక మాధ్యమాన్నే కోట్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో చాలా మంది తమన టాలెంట్ చూపించుకోవడానికి సోషల్ మీడియానే ఖాతాలు తెరుస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఖాతాలు ఉంటున్నాయి. సామాన్యులు సెలబ్రిటీలుగా మారుతున్నారు. సెలబ్రిటీలు మరింత ప్రచారం పొందుతూ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్(Face book) వాట్సాప్(Whats up), ఇన్‌స్టాగ్రామ్(Instagram), ఎక్ట్, లింక్‌డ్ ఇన్, చాట్ జీపీటీ, షేర్‌చాట్ తదితర సోషల్ మీడియా యాప్స్ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా సెలబ్రిటీలు ఉంటున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది లక్షల మంది ఫాటోవర్లను కూడా సెలబ్రిటీలు కలిగి ఉన్నారు.
ఎక్కువ ఫాలోవర్లు ఉన్న కొంత మంది..
క్రిస్టియానో రొనాల్డో
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)ఇన్‌స్టాగ్రామ్‌లో 649 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
లియోనెల్ మెస్సీ
ఆర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) 505 మిలియన్ల ఫాలోవర్లను పొందారు.
సెలీనా గోమెజ్
ప్రముఖ గాయని మరియు నటి సెలీనా గోమెజ్ 422 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
డ్వేన్ జాన్సన్ (ది రాక్)
హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్(Dwen Jhonson) 395 మిలియన్ల ఫాలోవర్లను పొందారు.
కైలీ జెన్నర్
సామాజిక కార్యకర్త, టీవీ వ్యాఖ్యాత కైలీ జెన్నర్(kaily jennar)394 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
అరియానా గ్రాండే
ప్రముఖ గాయని అరియానా గ్రాండే(Ariyana Grande) 376 మిలియన్ల ఫాలోవర్లను పొందారు.
విరాల్ కోహ్లీ..
ఇక భారతదేశంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kholi) 270 మిలియన్ల ఫాలోవర్లతో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా నిలిచారు.