https://oktelugu.com/

india vs south africa t20 : బంతి బంతికి మారిన సమీకరణం.. నరాలు తెగే ఉత్కంఠ.. ముని వేళ్ళ మీద నిలబెట్టిన మ్యాచ్ ఇది.. భారత్ గెలుపు ఎలా సాధ్యమైందంటే?

బంతి బంతికి సమీకరణ మారింది. నరాలు తెగే ఉత్కంఠ చోటుచేసుకుంది. చివరికి ముని వెళ్ల మీద మ్యాచ్ నిలబెట్టింది.. కానీ అంతిమంగా భారత జట్టు విజయం సాధించింది. సెంచురియన్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో భారత్ 11 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్ల సిరీస్ లో 2-1 లీడ్ లో నిలిచింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2024 9:09 am

    india vs south africa

    Follow us on

    india vs south africa t20 : తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 56 బంతులు ఎదుర్కొని 107 పరుగులు చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు (0) మరోసారి డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 25 బంతుల్లో 50 రన్స్ చేసి తన పూర్వపు ఫామ్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, సిమెలానే చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. చేజింగ్ లో దక్షిణాఫ్రికా ఓవర్లు మొత్తం ఆడింది. ఏడు వికెట్లకు 208 రన్స్ చేసింది. జాన్సన్ 17 బంతుల్లో 54 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. క్లాసెన్ 41, మార్క్రం 29 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు సాధించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా కీటకాలు మైదానంలోకి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు 20 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది.

    అతడు అదరగొట్టాడు

    భారత స్పిన్నర్లు మరోసారి మాయాజాలాన్ని ప్రదర్శించారు. ఫలితంగా భారీ చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా కాస్త తడబడింది.. ఓపెనర్లు రికెల్టన్ 20, హెన్డ్రిక్స్ 21 దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ.. ఎక్కువసేపు కొనసాగ లేక పోయారు. అర్ష్ దీప్ సింగ్ రికెల్టన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. హెన్డ్రిక్స్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బోల్తాపడ్డాడు. మిడిల్ ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ సమర్థవంతంగా బౌలింగ్ చేశారు. ఇదే క్రమంలో స్టబ్స్ అక్షర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మర్క్రం వరుణ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు.. క్లాసెన్, మిల్లర్(18) అయితే వికెట్ కు ఏకంగా 58 పరుగులు జోడించారు.. ఈ దశలో దక్షిణాఫ్రికా విజయ సమీకరణం 30 బంతులకు 86 పరుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిల్లర్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ అర్ష్ దీప్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా టీమిండియా చేతుల్లోకి వచ్చింది. అయితే ఈ దశలో జాన్సన్ దక్షిణాఫ్రికా జట్టులో ఆశలు పెంచాడు.. ముఖ్యంగా 19ఓవర్ లో హార్థిక్ పాండ్యా బౌలింగ్లో జాన్సన్ 2 సిక్సులు, మూడు ఫోర్లు కొట్టి 26 పరుగులు పిండుకున్నాడు. దీంతో చివరి ఓవర్లో టార్గెట్ 25 పరుగులకు తగ్గింది. ఈ నేపథ్యంలో జాన్సన్ అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో ఆటయ్యాడు. ఫలితంగా భారత్ ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయాన్ని సొంతం చేసుకుంది.