https://oktelugu.com/

Children’s Day 2024: బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజు పిల్లలకు ఎలాంటి బహుమతులు ఇవ్వాలంటే?

బాలల దినోత్సవాన్ని పిల్లల హక్కులను ప్రోత్సహించడంతో పాటు వారి అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో జరుపుకుంటారు. పిల్లలే భవిష్యత్తులో దేశానికి ఉత్తమ పౌరులుగా నిలుస్తారు. పిల్లలను ప్రపంచ వ్యాప్తంగా రక్షించడం, వారికి విలువ ఇవ్వడం, రోజూ వారి పోషకాహారం, విద్య అన్ని అందేలా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 14, 2024 / 09:09 AM IST

    Children's Day 2024

    Follow us on

    Children’s Day 2024: చిన్న పిల్లలను దేవుడితో పోలుస్తారు. ఎవరూ ఏం అనకుండా వీరిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ప్రతీ ఏడాది నవంబర్ 14వ తేదీన జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెహ్రూకి పిల్లలు అంటే చాలా ఇష్టం. వారిని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. అయితే అతని మరణాంతారం భారత ప్రభుత్వం ఆయన జయంతి రోజు బాలల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. అయితే ఐక్యరాజ్య సమితి 1956లో నవంబర్ 20న యూనివర్సల్ చిల్డ్రన్స్ డేగా నిర్ణయించింది. కానీ భారత ప్రభుత్వం నెహ్రు జన్మదినం సందర్భంగా 1964 అతని మరణాంతరం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. అయితే ఒక్కో దేశంలో ఒక్కో రోజు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

    బాలల దినోత్సవం ప్రాముఖ్యత
    బాలల దినోత్సవాన్ని పిల్లల హక్కులను ప్రోత్సహించడంతో పాటు వారి అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో జరుపుకుంటారు. పిల్లలే భవిష్యత్తులో దేశానికి ఉత్తమ పౌరులుగా నిలుస్తారు. పిల్లలను ప్రపంచ వ్యాప్తంగా రక్షించడం, వారికి విలువ ఇవ్వడం, రోజూ వారి పోషకాహారం, విద్య అన్ని అందేలా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది పిల్లలు పోషకాహారం లేకపోవడం వల్ల మరణిస్తున్నారు. మరికొందరు చదువు లేక రోడ్లుపైన తిరుగుతున్నారు. వీటిన్నింటిని అరికట్టి పిల్లలను భవిష్యత్తు తరాలకి వారు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ప్రతీ ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

    ఈ ఏడాది థీమ్ ఏంటంటే?
    ప్రతి బిడ్డ ప్రాథమిక హక్కులు వారికి తెలిసేలా కృషి చేయాలనే థీమ్‌తో ఈ ఏడాది జరుపుకుంటున్నారు. పిల్లలను భవిష్యత్తులో అభివృద్ధికి, విద్య, ఆహారం అన్ని అందాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

    పిల్లలకు ఈ రోజు ఇలాంటి బహుమతులు ఇవ్వండి
    పిల్లలకు వారికి కావాల్సినవి చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు అని తల్లిదండ్రులు అనుకుంటే పొరపాటే. ఇవే పిల్లలు కోరుకుంటారని చాలా మంది తల్లిదండ్రులు ఇవే ఇస్తారు. కానీ పిల్లలు ప్రేమ, ఆప్యాయత, సమయం వంటివి తల్లిదండ్రుల నుంచి కోరుకుంటారు. వీటిని పిల్లలకు అందేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. అలాగే పిల్లల ధైర్యంతో జీవితంలో ఉండేలా వారిని ప్రోత్సహించాలి. ఆర్థిక విషయాల్లో ప్రణాళికలు, ఏ సమస్యను అయిన క్లియర్ చేసే విధంగా, భయంతో కాకుండా ధైర్యంగా జీవించేలా పిల్లలను తీర్చిదిద్దాలి. పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిర పడటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అన్నింటికంటే పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే పెద్ద బహుమతులు ఇవే. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే అన్ని విలువలు తెలిసేలా పెంచండి. బంధువులు, గౌరవం, డబ్బు విలువ, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బాధ్యతలు ఇలా అన్నింటి గురించి వారికి తల్లిదండ్రులు నేర్పించాలి. ఇదే వారి జీవితంలో పెద్ద గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ రోజుల్లో వర్క్‌లో బిజీ అయిపోయి పిల్లలను అసలు పట్టించుకోవడం లేదు. పిల్లల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదనే ఆలోచనలో ఉండండి. పిల్లలకు ఇవ్వాలసిన సమయం, ప్రేమ, ఆప్యాయతలు పంచి పెట్టండి.