Inaya Sultana Viral Pic: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు వాళ్ళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏమాత్రం సమయం దొరికినా కూడా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది ఫేడ్ ఔట్ భామలు సైతం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి మళ్ళీ అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇనయా సుల్తానా పలు సినిమాల్లో నటించి నటిగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. రీసెంట్ గా క్వారీలో ఒక ఫోటో షూట్ చేసింది. అందులో అద్భుతంగా కనిపించడమే కాకుండా ఆమె అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది… పసుపు రంగు చీరలో గోల్డెన్ కలర్ జాకెట్ లో తన అందచందాలను ఒంపు సొంపులను చూపిస్తూ కుర్రాళ్ల మతులను పోగొడుతోంది… బిగ్ బాస్ 6 సీజన్ లో పాల్గొని ప్రేక్షకులందరికి సుపరిచితురాలైంది. ఇక ఆ సీజన్లో తను ఆడిన గేమ్ తో ప్రేక్షకుల మనుసులను కొల్లగొట్టింది. అలాంటి ఆవిడ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ ఈ మధ్యకాలంలో ఆమె చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఇన్ స్టా లో అవకాశం దొరికిన ప్రతిసారి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తోంది. తన అభిమానులు సైతం తన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక కొంతమంది మాత్రం పెళ్లి అయిన తర్వాత ఇనాయా ఎందుకని ఇలా ఎక్స్ పోజ్ చేస్తోంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే ఆమె సినిమాలను చేయకుండా ఇన్ స్టా లోనే అభిమానులను ఆనందింపచేస్తోంది… తొందరలోనే ఒక పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఆమె ఎన్ని చేసిన పాపులర్ కాలేదు కానీ రామ్ గోపాల్ వర్మతో డాన్స్ చేసిన ఒక వీడియో వైరల్ అయింది.
దాని వల్ల ఆమె ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తెలియని వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికైనా ఆమెకు ఎవరైనా హీరో అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…