Bigg Boss 9 Telugu Kalyan: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో టైటిల్ విన్నింగ్ కి అతి చేరువగా ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు తనూజ. సోషల్ మీడియా లో ఏ పోల్ చూసుకున్నా తనూజ కి దరిదాపుల్లో కూడా ఏ కంటెస్టెంట్ లేడు. ఇది చాలా మందికి రుచించడం లేదు. మొట్టమొదటిసారి బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లో మొట్టమొదటి లేడీ టైటిల్ విన్నర్ గా తనూజ నిలబడే అవకాశాలను అడ్డుకునేందుకు స్వయంగా స్టార్ మా ఛానల్ ప్రయత్నం చేస్తోందని తనూజ అభిమానులు ఆధారాలతో సహా నిన్నటి నుండి కొన్ని వీడియోలు పోస్టు చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నిన్నటి నుండి ‘బిగ్ బాస్ కింగ్డమ్’ టాస్క్ మొదలైంది. ఈ టాస్కుల్లో భాగంగా నిన్న చివరి టాస్క్ లో సంచాలక్ గా కళ్యాణ్ తప్పు నిర్ణయం తీసుకున్నప్పటికీ బిగ్ బాస్ దాన్ని టెలికాస్ట్ లో చూపించకుండా కళ్యాణ్ కి పాజిటివ్ అయ్యేలా కట్ చేశారు.
టాస్క్ ఏమిటంటే, స్క్వేర్ ఆకారం లో కొన్ని బాక్స్ లు ఉంటాయి. వాటిని ఒక దాని మీద ఒకటి నిలబెడుతూ ఉండాలి. అలా ఎవరి బాక్సులు అయితే ఎక్కువగా ఉంటాయో, వాళ్ళు ఈ గేమ్ గెలిచినట్టు. ఈ టాస్క్ లో సంజన మరియు సుమన్ పాల్గొంటారు. ఇద్దరు సమానంగా బాక్సులను ఎత్తుగా అమరుస్తారు. కానీ సంజన టవర్ ఒక పద్ధతైన ఆకారం లో పొడవుగా ఉంటుంది,కానీ సుమన్ బాక్సులు కొన్ని జిగ్ జాగ్ గా ఉంటాయి. అయితే ఎపిసోడ్ లో సుమన్ కంటే ముందు సంజన పెట్టినట్టు చూపించారు. కానీ వాస్తవం ఏమిటంటే సంజన పెట్టిన ఆ బాక్స్ క్రింద పడిపోయింది. ఆ సమయం లో సుమన్ సంజన కంటే ఒక ఎక్కువగా, ఆమెకంటే ముందుగా పెడుతాడు. ఈ విషయాన్నీ తనూజ కూడా ప్రస్తావించి నిలదీస్తుంది.
కానీ సుమన్ ముందు పెట్టాడు అంటూ తనూజ చెప్పే మాటలను కట్ చేసి టెలికాస్ట్ చేసింది బిగ్ బాస్ టీం. ఇన్ని రోజులు తనూజ ని స్టార్ మా ఛానల్ ముద్దు బిడ్డ అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. కానీ ఈ ఘటన చూస్తుంటే తనూజ ని కేవలం టీఆర్ఫీ రేటింగ్స్ కోసం వాడుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఒక కామన్ మ్యాన్ చేతిలో కప్పు పెడితే మంచి పేరొస్తుందని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, తనూజ కి మాత్రం తీరని అన్యాయం జరిగేలాగానే అనిపిస్తోంది. సీజన్ 7 లో కూడా ఇంతే. కంటెంట్ కోసం టీఆర్ఫీ రేటింగ్స్ కోసం అమర్ దీప్ ని ఒక రేంజ్ లో వాడుకొని అతన్ని నెగిటివ్ చేసి, పల్లవి ప్రశాంత్ చేతిలో కప్పు పెట్టారు. అందుకే సెలబ్రిటీలు ఈ సీజన్ లో సామాన్యులు పాల్గొంటున్నారు అనే వార్త తెలియగానే మేము ఈ బిగ్ బాస్ షో కి రాలేము అంటూ దండం పెట్టారు.