YS Jagan Latest News: ఏదైనా తెగేదాకా లాగకూడదు. అలా లాగే క్రమంలో చాలా రకాల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) ఇటువంటి పరిస్థితి ఎదురైంది. సిబిఐ కోర్టుకు హాజరు విషయంలో జగన్మోహన్ రెడ్డి విముఖత చూపారు. తనకు మినహాయింపులు కావాలని కోరారు. అందుకు సిబిఐ కోర్టు అనుమతి నిరాకరించింది. సిబిఐ సైతం కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే దీనిపై సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లేందుకు ఛాన్స్ ఉంది. కానీ అక్కడ ప్రతికూల తీర్పు ఇస్తే జగన్ మరోసారి జాతీయస్థాయిలో చర్చకు దారి తీయడం ఖాయం. దాని పర్యవసానాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దానిని గుర్తించి జగన్ ఇప్పుడు సిబిఐ కోర్టుకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇన్నాళ్లు బెయిల్ పై..
జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. 2012లో ఆయన అరెస్టయ్యారు. అప్పట్లో సిబిఐ తో( Central Bureau of Investigation ) పాటు ఈడి ఎంట్రీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసింది. పాదయాత్రకు సిద్ధపడుతుండగా అరెస్టయ్యారు. దాదాపు 16 నెలల పాటు చంచల్గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. తరువాత ఆయనకు బెయిల్ దక్కింది. అయితే అది కండిషనల్ బెయిల్. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కావాల్సి వచ్చేది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కోర్టుకు హాజరు మినహాయింపు దక్కింది జగన్మోహన్ రెడ్డికి. 2019 మార్చి వరకు ఆయన ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ సీఎం హోదాలో మాత్రం 2020 జనవరిలో హాజరయ్యారు. అయితే ఇప్పుడు సిబిఐ కోర్టుకు మరోసారి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21న సిబిఐ కోర్టుకు వెళ్ళనున్నారు జగన్మోహన్ రెడ్డి. దీంతో కోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుందో అన్న టెన్షన్ వైసీపీలో ఉంది. అందరిలోనూ ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది.
వ్యక్తిగత హాజరుపై..
ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అక్రమస్తుల కేసులు ఉండడంతో ఆయన సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సిబిఐ కోర్టును ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే దీనిని సమతించారు జగన్మోహన్ రెడ్డి. విదేశీ పర్యటనకు వెలుగు వచ్చారు. తీరా వచ్చాక తనకు కోర్టు హాజరు విషయంలో మినహాయింపులు ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు. అయితే అనుమతులు ఇవ్వొద్దని సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు సైతం మినహాయింపులు ఇవ్వదలుచుకోలేదని స్పష్టం చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్తారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేదని.. ఈనెల 21న కోర్టుకు హాజరవుతానని జగన్మోహన్ రెడ్డి సమాచారం ఇచ్చారు.
రాజకీయంగా ఇబ్బంది రాకూడదని..
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ఆదేశాలపై.. హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తే.. దానిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని పాటించాల్సిందేనని హైకోర్టు తీర్పు చెబితే జగన్కు రాజకీయంగా ఇబ్బంది కరం. పైగా సుప్రీంకోర్టును ఆశ్రయించలేరు. అలాగని సిబిఐ కోర్టుకు హాజరైతే పరువు పోయినంత పని అవుతుంది. అందుకే 21న సిబిఐ కోర్టుకు హాజరుకావాలని జగన్మోహన్ రెడ్డి ఒక అంగీకారానికి వచ్చారు. ఆ వివాదాన్ని అలా ఫుల్ స్టాప్ పెట్టగలిగారు.