Inaya Sultana: బిగ్ బాగ్ బ్యూటీ ఇనయ సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీజన్ 6 కంటెస్టెంట్ గా వచ్చి ఫుల్ ఫేమ్ సంపాదించింది. ఇనయ హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కానీ ఆమెకు అవకాశాలు దక్కలేదు. ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినప్పటికీ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో వార్తలకెక్కింది.
ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకుని షోలో అడుగు పెట్టింది. అప్పటి వరకు ఎవరో కూడా తెలియని ఇనయ పాపులారిటీ సంపాదించింది. ఈ రియాలిటీ షో ద్వారా అవకాశాలు వస్తాయని ఆశించింది. కానీ ఇనయ అనుకున్నట్లు జరగలేదు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎలా ఆఫర్స్ కోసం తిరిగిందో .. ఇప్పుడు కూడా అలానే ఆఫీసుల చుట్టూ తిరుగుతుందట. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో జ్యోతిష్యుడు వేణు స్వామి ని కలిసి ప్రత్యేక పూజలు చేయించుకుంది.
ఈ పూజలు చేయించుకున్న ఫోటోలు వీడియోలు తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. జనవరి 17న వేణు స్వామి పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఇనయ పూల మాల మెడలో వేసుకుని కూర్చుని ఉండగా వేణు స్వామి కలశం తో ఆమె పై నీళ్లు చల్లాడు. ఒక ఫొటోలో అయితే ఇనాయ వేణు స్వామికి మొక్కుతూ ఉండగా ఆయన ఆశీర్వదించాడు. కాగా నా గురూజీ వేణు స్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఇది చూసిన నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఏంటి పూజ చేయించ గానే ఫేమస్ అయిపోతావ్ అనుకున్నావా. వెంటనే హీరోయిన్ గా పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇస్తారని అనుకుంటున్నావా .. ఇలాంటివన్నీ అసలు ఎలా నమ్ముతారు? అందులోనూ మీరు ఒక ముస్లిం. హిందూ పూజలు చేయిస్తున్నావేంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. నెటిజన్స్ కామెంట్స్ కి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. కౌంటర్ గా…. ‘ నేను భారతదేశంలో పుట్టాను. నచ్చింది చేసే స్వేఛ్చ నాకు ఉంది. మధ్యలో మీకేంటి సమస్య’ అంటూ ఇచ్చి పడేసింది. ఇనయ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.