Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మూడు వారాల థియేట్రికల్ రన్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని, నాల్గవ వారం లోకి అడుగుపెట్టింది. ఈ మూడు వారాలు థియేటర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండుగా కళకళలాడిపోయాయి. ఇలా చూసి ఎన్ని రోజులుఅయ్యిందో అంటూ ట్రేడ్ వర్గాలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. అన్నీ ప్రాంతాల్లో ఒక ఎత్తు, సీమ ప్రాంతం లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రభంజనం మరో ఎత్తు. ఇప్పటికీ రోజువారీ థియేట్రికల్ షేర్స్ లో సీమ నుండి వచ్చే వసూళ్లే టాప్ లో ఉన్నాయి. అక్కడి ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మూడు వారాల్లో 18,56,444 మంది చూశారట. సంక్రాంతి సినిమాల్లో ఇదొక ఆల్ టైం రికార్డు అని అంటున్నారు. నిన్న కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయిలో గ్రాస్ నమోదైంది.
ఇక గ్రాస్ వసూళ్లు అయితే సీమ ప్రాంతం నుండి దాదాపుగా 31.48 కోట్ల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది. అందులో టాక్స్ లు, రెంట్స్ పోగా, మిగిలిన షేర్ 22 కోట్ల రూపాయలకు పైగానే ఉందని సమాచారం. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ఇక్కడితో ఆగిపోలేదు. ఖచ్చికంగా శివరాత్రి వరకు ఉంటుంది. కచ్చితంగా 23 నుండి 24 కోట్ల రూపాయిల క్లోజింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. నాలుగు సినిమాలతో పోటీ పడి, మెగాస్టార్ చిరంజీవి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టడం సాధారణమైన విషయం కాదు. గత సంక్రాంతి లాగా కేవలం రెండు సినిమాలే పోటీ ఉండుంటే, ఇక ఏ రేంజ్ గ్రాస్ వసూళ్లు వచ్చేవో మీరే ఊహించుకోండి అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సీమ ప్రాంతం లో రెబెల్ స్టార్ ప్రభాస్ తర్వాత అత్యధిక 20 కోట్ల షేర్ సినిమాలు ఉన్న హీరో కూడా మెగాస్టార్ చిరంజీవి నే.
ప్రభాస్ హీరో గా నటించిన ‘బాహుబలి 2 ‘, ‘బాహుబలి’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’ చిత్రాలు ఈ ప్రాంతం నుండి 20 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాయి. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు ఆ ప్రతిష్టాత్మక క్లబ్ లో చోటు సంపాదించుకున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కూడా 20 కోట్ల మార్కుకి దగ్గరగా వచ్చి ఆగింది. చాలా మంది నేటి తరం స్టార్ హీరోలకు కూడా మెగాస్టార్ సాధించిన ఈ అరుదైన రికార్డు ఇప్పటి వరకు వాళ్ళ కెరీర్ లో నమోదు అవ్వలేదు.