https://oktelugu.com/

Devara – Game Changer : విడుదలకు ముందే ‘దేవర’ ని దాటేసిన ‘గేమ్ చేంజర్’.. రామ్ చరణ్ కి దరిదాపుల్లో లేని జూనియర్ ఎన్టీఆర్!

దేవర సినిమా రికార్డులను త్వరలో విడుదల కాబోతున్న అల్లు అర్జున్ 'పుష్ప 2', రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' చిత్రాలు బ్రేక్ చెయ్యొచ్చు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో అయితే రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' చిత్రం 'దేవర' ని భారీ మార్జిన్ తో అధిగమించింది. దేవర చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 180 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 24, 2024 / 08:42 PM IST

    Devara - Game Changer

    Follow us on

    Devara – Game Changer : ప్రస్తుతం మన స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ పోరు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. గత మూడేళ్ళుగా ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియన్ సినిమాలను విడుదల చేస్తూ వచ్చాడు. హిట్ అయినా ప్లాప్ అయినా ఆయన సినిమా వల్ల వందల కోట్ల రూపాయిల వ్యాపారాలు జరిగేవి. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్స్ సినిమాలు పాన్ ఇండియన్ స్కేల్ లో విడుదల అవ్వలేదు. ‘భీమ్లా నాయక్’ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ గా చేసిన సినిమా విడుదల కాలేదు. అలాగే అల్లు అర్జున్ మూడేళ్ళ నుండి ‘పుష్ప 2 ‘ షూటింగ్ లోనే నిమగ్నమై ఉన్నాడు. ఇక రామ్ చరణ్ పరిస్థితి కూడా అంతే, #RRR తర్వాత ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈ గ్యాప్ ని ప్రభాస్ బాగా ఉపయోగించుకున్నాడు.

    పాన్ ఇండియాలోనే నెంబర్ 1 సూపర్ స్టార్ అని అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కి పోటీగా మన స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదల అవ్వబోతున్నాయి. ఇటీవలే ‘ఎన్టీఆర్’ దేవర చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై అన్ని భాషల్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రికార్డులను త్వరలో విడుదల కాబోతున్న అల్లు అర్జున్ ‘పుష్ప 2’, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రాలు బ్రేక్ చెయ్యొచ్చు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో అయితే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం ‘దేవర’ ని భారీ మార్జిన్ తో అధిగమించింది. దేవర చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 180 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 150 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ‘దేవర’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది.

    ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే 40 కోట్ల రూపాయిల వ్యత్యాసం ఈ రెండు సినిమాలకు ఉన్నాయి. అలాగే ఓవర్సీస్ లో ‘గేమ్ చేంజర్’ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, నార్త్ ఇండియా లో 45 కోట్ల రూపాయిలు, కర్ణాటక లో 16 కోట్ల రూపాయిలు, తమిళనాడు లో 30 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ‘గేమ్ చేంజర్’ చిత్రానికి 271 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు సమాచారం. అంటే దేవర చిత్రం కంటే అదనంగా వంద కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది అన్నమాట. ఇది మామూలు విషయం కాదు. సంక్రాంతి సీజన్ లో విడుదల అవుతున్న ‘గేమ్ చేంజర్’ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారం లోనే రికవరీ అయిపోతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.