ఇది ఘోరమైన అవమానం అని చెప్పొచ్చు. జైలుకు వెళ్లే ముందు జానీ మాస్టర్ చేతిలో 23 సినిమాలు ఉన్నాయి, వాటిల్లో ‘పుష్ప 2’ కూడా ఉంది. ఎప్పుడైతే ఆయన జైలు పాలయ్యాడో, అప్పుడే ఈ 23 సినిమాలు ఆయన చేతుల్లో నుండి వెళ్లిపోయాయి. ఈరోజు ‘పుష్ప 2 ‘ మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి నిర్మాతతో మాట్లాడుతూ ‘పుష్ప 2 చిత్రంలో జానీ మాస్టర్ ని ఒక పాట కోసం తీసుకున్నారు కదా, ఈరోజు ఆయనకి బెయిల్ వచ్చింది. ఆ పాటని అతని కొరియోగ్రఫీ లో చిత్రీకరిస్తారా? ‘ అని అడిగిన ప్రశ్నకి నిర్మాత సమాధానం ఇస్తూ ‘ఆ పాటని మరో కొరియోగ్రాఫర్ కి ఇచ్చేసాము. షూటింగ్ కూడా అయిపోయింది. జానీ మాస్టర్ మా సినిమాకి పనిచేయడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. అలా క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని జానీ మాస్టర్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీ కి అత్యంత ఆప్తుడు. అతనికి కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని ఇచ్చింది రామ్ చరణ్. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం వల్లే నేడు ఈ స్థాయికి ఎదిగాడు.
ఇప్పుడు మళ్ళీ సున్నా నుండి తన కెరీర్ ని మొదలు పెట్టాలి. మెగా ఫ్యామిలీ నే మళ్ళీ జానీ మాస్టర్ ని ఆదుకోవాలి. జానీ మాస్టర్ కి సపోర్టుగా మాట్లాడితే ఎక్కడ నెగటివిటీ వస్తుందో అని భయపడుతున్న రోజుల్లో మెగా బ్రదర్ నాగబాబు ఆయనకి సపోర్టుగా పరోక్షంగా కొన్ని ట్వీట్లు వేసాడు. ఇప్పుడు ఆయనకి బెయిల్ రప్పించడంలో కూడా నాగబాబు హస్తం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్. అయితే ఒకప్పుడు జానీ మాస్టర్ అనుభవించిన గౌరవ మర్యాదలు ఇప్పుడు ఆయనకి దక్కే అవకాశాలు లేవు. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఇద్దరి వైపు నుండి తప్పులు ఉన్నాయి. ఇద్దరు ఇస్టంగానే రిలేషన్ పెట్టుకున్నారు, జానీ మాస్టర్ బలవంతం చేయలేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.