https://oktelugu.com/

Devara Hindi Collections : దేవర హిందీ వెర్షన్ క్లోజింగ్ కలెక్షన్స్.. మహారాష్ట్ర సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆల్ టైమ్ రికార్డ్!

ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి హిందీ వెర్షన్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 15 కోట్ల రూపాయలకు జరిగింది. ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. వీటిలో జీఎస్టీ మరియు ఇతర టాక్సులు పోగా, 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 24, 2024 / 09:12 PM IST

    Devara Hindi Collections

    Follow us on

    Devara Hindi Collections :  ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై , మంచి టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటీటీ వృద్ధి లోకి వచ్చిన తర్వాత ఈమధ్య కాలంలో ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమాకి అయినా కేవలం 10 రోజుల వరకే భారీ వసూళ్లు వస్తున్నాయి. ఆ తర్వాత కలెక్షన్స్ బాగా తగ్గిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ‘దేవర’ చిత్రానికి వచ్చిన లాంగ్ రన్ ని చూసి ట్రేడ్ పండితులు నివ్వెరపోయారు. ఇప్పటికీ ఈ చిత్రం ప్రతీ రోజు 30 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతూ ఉందంటే జనాలకు ఈ సినిమా ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీపావళి రోజున ఈ సినిమాకి కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

    ఇది ఇలా ఉండగా తెలుగు వెర్షన్ వసూళ్లు ఇప్పటికీ ఆగకుండా వస్తుంటే, హిందీ వెర్షన్ వసూళ్లు మాత్రం దాదాపుగా ఆగిపోయినట్టే అని చెప్పొచ్చు. లాభాలు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి హిందీ వెర్షన్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 15 కోట్ల రూపాయలకు జరిగింది. ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. వీటిలో జీఎస్టీ మరియు ఇతర టాక్సులు పోగా, 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. అంటే జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి అదనంగా 7 కోట్ల రూపాయిల లాభం వచ్చింది అన్నమాట. మొదటి వీకెండ్ లో డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకున్న ఈ చిత్రం, రెండవ వారంలో పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత మూడవ వారం లో పూర్తిగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. పుష్ప రేంజ్ లో థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకొని వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందని అందరూ అనుకుంటే, 40 కోట్ల రూపాయిల వద్దే థియేట్రికల్ రన్ ని ముగించుకోవాల్సి వచ్చింది.

    అయితే ఈ చిత్రం ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో బాగా ఆడిందని తెలుస్తుంది. అక్కడ రీసెంట్ గా విడుదలైన బాలీవుడ్ చిత్రాలకు సింగల్ స్క్రీన్ థియేటర్స్ నుండి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. అనేక చోట్ల థియేటర్స్ ని రన్ చేసుకోలేక మూసివేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి పరిస్థితిలో ‘దేవర’ చిత్రం మహారాష్ట్ర సింగిల్ స్క్రీన్స్ ని బ్రతికించిందని అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా వీకెండ్స్ లో ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయట. ఇది ఇలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రతీ చోట బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్నట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.