Pushpa 2: అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన యాక్షన్ క్రైమ్ డ్రామా పుష్ప 2. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప 2 చిత్రానికి ఆదరణ దక్కుతుంది. వరల్డ్ వైడ్ ఐదు రోజుల్లో పుష్ప 2 మూవీ వసూళ్లు వెయ్యి కోట్లకు చేరువయ్యాయి. ఫస్ట్ వీక్ కి పుష్ప 2 వసూళ్లు ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం ఖాయం. ఇక హిందీలో తెలుగుతో సమానంగా రెస్పాన్స్ వచ్చింది. ఫాస్టెస్ట్ రూ. 300 కోట్ల హిందీ చిత్రంగా పుష్ప 2 రికార్డులకు ఎక్కింది. 5 రోజులకు పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 339 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. వర్కింగ్ డేస్ లో కూడా వసూళ్లు తగ్గడం లేదు.
యూఎస్ లో పుష్ప 2 కలెక్షన్స్ $ 10 మిలియన్ దాటేశాయి. రన్ ముగిసే నాటికి పుష్ప 2 కలెక్షన్స్ ఫిగర్ మైండ్ బ్లాక్ చేయడం ఖాయం. పుష్ప 2 అల్లు అర్జున్ ఇమేజ్ ని ఎవరూ ఊహించని రేంజ్ కి తీసుకెళ్లింది. ఇండియాలోనే అతిపెద్ద హీరోగా అల్లు అర్జున్ అవతరించాడు. అదే సమయంలో పుష్ప 2 పై విమర్శలు తప్పడం లేదు. ఈ మూవీలో అల్లు అర్జున్ రెడ్ శాండిల్ స్మగ్లర్ రోల్ చేశాడు. దీన్ని పలువురు తప్పుబడుతున్నారు. తాజాగా రాజేంద్రప్రసాద్.. వాడెవడో ఎర్ర చందనం స్మగ్లర్ హీరో అట. కలియుగంలో ఇలాంటి కథలు మనం చూడాల్సి వస్తుందని పరోక్షంగా అల్లు అర్జున్ పై మాటల దాడి చేశారు.
కాగా ఓ సామాజిక వర్గం పుష్ప 2 నిర్మాతలపై ఫైర్ అయ్యారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ చేసిన పాత్రకు భన్వర్ సింగ్ షెకావత్ అనే పేరు వాడారు. నెగిటివ్ రోల్ కి షెకావత్ అనే సామాజిక వర్గం పేరు పెట్టడాన్ని వారు ఖండిస్తున్నారు. క్షత్రియ కర్ణి సేన లీడర్ రాజ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పుష్ప 2 నిర్మాతలపై దాడి చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. సినిమా వాళ్లు తరచుగా మన క్షత్రియ సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు. పుష్ప 2 సినిమాలో షెకావత్ పేరు తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.