Bigg Boss 6 Telugu- Ghosts: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై 11 వారాలు పూర్తి చేసుకొని 12 వ వారం లోకి అడుగుపెట్టింది..ఈ సీజన్ మొత్తం ప్రేక్షకుల అంచనాలకు బిన్నంగా ఎవ్వరు ఊహించని రీతిలో టాస్కుల దగ్గర నుండి ఎలిమినేషన్స్ వరుకు జరుగుతూ వస్తున్నాయి..గత వారం మరీనా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోగా, ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేటైన ఇంటి సభ్యులు రోహిత్, శ్రీహాన్, శ్రీ సత్య,ఆది రెడ్డి, రాజ్ , ఇనాయ, ఫైమా.

వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్ళబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసిక్తకరం గా మారింది..అయితే నామినేషన్స్ ప్రక్రియ ప్రతి వారం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య చాలా హీట్ వాతావరణం మధ్య కొనసాగుతూ వచ్చింది..కానీ ఈ వారం బిగ్ బాస్ ప్రతి కంటెస్టెంట్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి నామినేషన్స్ వెయ్యమని అడగడం తో గొడవలు లేకుండా ప్రశాంతం గా నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది.

ఇక పోతే బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం లో మరీనా మరియు వాసంతి దెయ్యాల వేషాలు వేసుకొని అర్థ రాత్రి ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే..అప్పట్లో వీలీలందరి ప్లాన్ ఫలించి బాగా నవ్వులు పూయించారు..అయితే ఈ వారం శ్రీ సత్య మరియు ఫైమా అలాగే దెయ్యం వేషం వేసుకొని ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసారు..రాజ్ కి చీకటి అన్నా దెయ్యం అన్నా కాస్త భయం..ముందుగా వీళ్లిద్దరు రాజ్ ని భయపెట్టే ప్రయత్నం చేసారు..కానీ వాళ్ళ ప్లాన్ బెడిసికొట్టింది..రాజ్ ఈసారి భయపడలేదు.

ఆ తర్వాత శ్రీహాన్ ని భయపెట్టే ప్రయత్నం చేసారు..నిద్ర పోతున్న శ్రీహాన్ పక్కన పడుకొని అతనిని భయపెట్టింది శ్రీ సత్య..అలా నిన్న వీళ్లిద్దరు ఈ దెయ్యం టాస్క్ తో హౌస్ మేట్స్ ని భయపెట్టి ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసారు..రాబొయ్యే రోజుల్లో కూడా ఇదే టాస్క్ ని ఈ ఇద్దరు రిపీట్ చేస్తారో లేదో చూడాలి.