Homeఎంటర్టైన్మెంట్Prabhas: రాధేశ్యామ్​లో ఒక్క పాట కోసం ఎన్ని వర్షన్స్​ ట్రై చేశారో తెలిస్తే షాక్​!

Prabhas: రాధేశ్యామ్​లో ఒక్క పాట కోసం ఎన్ని వర్షన్స్​ ట్రై చేశారో తెలిస్తే షాక్​!

Prabhas: యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్​ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రాధే శ్యామ్​. భారీ బడ్జెట్​తో పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్​గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్​ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్​కు సిద్ధంగా ఉంది ఈ సినిమా. ప్రస్తుతం ప్రమోషన్స్​, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్​ బిజీగా గడుపుతోంది చిత్రబృందం. ఈ సినిమా ప్రభాస్​కు ఎంత ప్రత్యేకమే స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. చాలా కాలంతర్వాత మళ్లీ డార్లింగ్​ను లవర్​బాయ్​గా చూడబోతున్నందుకు ఆయన అభిమానలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరోవైపు, ఈ సినిమా ఆల్బమ్​పైనా అంతే అంచనాలు నెలకొన్నాయి.

in-radhe-shyam-movie-for-one-song-they-tested-with-different-variations-in-hindi

కాగా, ఈ సినిమా ఆల్బమ్స్​ను సౌత్​ వర్షన్​కు ఒకరు, హిందీ వర్షన్​కు మరొకరు పని చేస్తున్నారు. హిందీలో మనన్ భరద్వాజ్​ సాంగ్స్​ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనేే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి. ఇందులో ఒకే పాటకోసం తాను ఏకంగా 30కి పైగా డిఫ్రెంట్​ వర్షన్స్​ను ప్రిపేర్​ చేసుకున్నాడట. అయితే, వాటిల్లో ఒక్కటి మాత్రమే ఖరారు అవ్వడం.. ఫైనల్​ అవుపుట్​ మాత్రం వేరే లెవెల్​ వచ్చిందని తెలిపారు. అయితే, థియేటర్లలో ఈ సాంగ్స్​ ఎలా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధం చేస్తోంది చిత్రబృందం. మరోవైపు, సలార్​ సినిమాలోనూ నటిస్తున్నారు ప్రభాస్​. ఇటీవలే ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ కూడా పూర్తి చేసుకున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version