Gangavva: యూట్యూబ్ తో స్టార్ అయిన గంగవ్వ అనంతరం బిగ్ బాస్ లోకి చేరి ఫేమస్ అయ్యింది. తను ఇంటిని నిర్మించుకునేందుకే బిగ్ బాస్ లోకి వచ్చానని.. ఆ కల నెరవేర్చాలని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను కోరింది. ఈ క్రమంలోనే రూ.10 లక్షలు పెట్టి నేను గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని పోయిన సంవత్సరమే కింగ్ నాగార్జున హామీ ఇచ్చారు. అన్నట్టుగానే నాడు ప్రారంభించి ఏడాదిలోగానే పూర్తి చేశారు.

యూట్యూబ్ తో పాపులర్ అయిన గంగవ్వ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా ఇంట్లో అడుగుపెట్టిన గంగవ్వ ఐదు వారాల్లో మరింత పాపులారిటీ సంపాదించింది. అనారోగ్యం కారణంగా అప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. తన చిరకాల కోరికను హోస్ట్ నాగార్జున ముందు పెట్టింది. ఈ క్రమంలోనే స్టేజీ మీదనే గంగవ్వకి ఇల్లు కట్టిస్తానని నాగార్జున హామీ ఇచ్చాడు. ఆ బాధ్యత తీసుకున్నారు.
బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి నాగార్జున ఏకంగా గంగవ్వ ఇంటికోసం రూ.11 లక్షల రూపాయలు అందించినట్టు తెలుస్తోంది. గంగవ్వ మరో మూడు లక్షలు చేతిలో ఉండడంతో ఈ మొత్తం డబ్బులతో ఆమె ఇంటి కల నెరవేరింది.
తాజాగా కొత్త ఇంట్లో గంగవ్వ గృహ ప్రవేశం చేసింది. కార్యక్రమానికి బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్లు కూడా హాజరయ్యారు. అఖిల్, శివజ్యోతితోపాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్ షో టీం సభ్యులు సహా ఈ గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పుడు గంగవ్వ గృహ ప్రవేశ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.
ప్రస్తుతం గంగవ్వ పలు టీవీ షోలతోపాటు సినిమాల్లో, యూట్యూబ్ లో నటిస్తూ బిజీగా ఉంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి ఆమె స్వగ్రామం. అక్కడే కొత్త ఇంటిని నిర్మించుకొని తాజాగా గృహ ప్రవేశం చేసింది.