Imran Hasmi
Imran Hasmi : ఇప్పటి వరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇక మీదట మాత్రం ప్రతి హీరో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ విజయాలను సాధించాలానే లక్ష్యం తో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక బాలీవుడ్ హీరోలు కొంత మంది వరుస సక్సెస్ లను సాధించలేక ఢీలా పడుతుంటే మరికొంతమంది మాత్రం విలన్స్ గా మారి వాళ్ల టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకప్పుడు మంచి గుర్తింపైతే ఉండేది. ఇక అప్పట్లో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇమ్రాన్ హష్మీ(Imran Hasmi)లాంటి హీరో సైతం ప్రస్తుతం అవకాశాలు లేక విలన్ పాత్రలను పోషిస్తున్నాడు. వరుసగా 14 డిజాస్టర్లను మూట గట్టుకున్నప్పటికి ఆయన ఇకమీదట సినిమాలు చేసిన కూడా అతని సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వవని తెలుసుకున్న ఆయన పవన్ కళ్యాణ్ ఓ జీ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవాలని చూస్తున్నాడు…బాలీవుడ్ సినిమాల్లో మంచి విజయాలను అందుకున్న ఈయన గత కొన్ని సంవత్సరాలు నుంచి సరైన సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు. దాంతో విలన్ పాత్రలను సైతం చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అతని చెల్లెలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది అనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆమె ఎవరంటే అలియ భట్…అవును మీరు విన్నది నిజమే అలియా తనకి సొంత చెల్లెలు కాకపోయినా ఆయన మాత్రం తన సొంత చెల్లెలి గానే భావిస్తూ తనని చెల్లి అంటూ పిలుస్తూ ఉంటారట.
Also Read : బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్
అందువల్లే వీళ్ళిద్దరి మధ్య అన్న చెల్లెల రిలేషన్ షిప్ అయితే ఉందని చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు సైతం చెబుతూ ఉంటారు. మరి వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండటమే కాకుండా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకునేంత స్నేహపూర్వకమైన అనుబంధం కూడా ఉందని మరికొంతమంది కామెంట్స్ చేస్తుంటారు.
మరి ఏది ఏమైనా కూడా ఇమ్రాన్ హష్మీ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఓ జి సినిమాలో విలన్ గా తన పాత్రను ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక రీసెంట్ గా అనిమల్ సినిమాతో విలన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాబి డియోల్ (Babi Deal) బాటలోనే ఇమ్రాన్ హష్మీ నడుస్తూ ఉండడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి బాలీవుడ్ హీరోలు వాళ్ళ సత్తాను నిరూపించుకోవాలంటే మాత్రం భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది. దాంతో పాటు తన క్యారెక్టర్ కి గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది…
Also Read : బాలీవుడ్ : వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !