https://oktelugu.com/

గోవా బ్యూటీ ఆశలన్నీ ఆ సినిమాపైనే

గోవా బ్యూటీ ఇలియానా గుర్తుందా? ఎందుకు గుర్తుండదు. మరిచిపోయే అందమా ఆమెది. తెలుగులో ఒకప్పుడు నంబర్ వన్ హీరోయిన్‌ ఆమె. మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆమెను టాలీవుడ్‌ అక్కున చేర్చుకుంది. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వం వహించిన ‘దేవదాసు’తో తెరంగేట్రం చేసిందామె. ఆ సినిమా హిట్‌ అవగా.. రెండో మూవీ ‘పోకిరి’ ఇండస్ట్రీ బ్లాక్‌ బ్లస్టర్ అయింది. ఈ రెండు సినిమాల్లో ఇలియానా అందాలకు తెలుగు యువత ఫిదా అయింది. అంతే, వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 21, 2020 / 04:51 PM IST
    Follow us on


    గోవా బ్యూటీ ఇలియానా గుర్తుందా? ఎందుకు గుర్తుండదు. మరిచిపోయే అందమా ఆమెది. తెలుగులో ఒకప్పుడు నంబర్ వన్ హీరోయిన్‌ ఆమె. మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆమెను టాలీవుడ్‌ అక్కున చేర్చుకుంది. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వం వహించిన ‘దేవదాసు’తో తెరంగేట్రం చేసిందామె. ఆ సినిమా హిట్‌ అవగా.. రెండో మూవీ ‘పోకిరి’ ఇండస్ట్రీ బ్లాక్‌ బ్లస్టర్ అయింది. ఈ రెండు సినిమాల్లో ఇలియానా అందాలకు తెలుగు యువత ఫిదా అయింది. అంతే, వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. పవన్‌ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్, బన్నీ ఇలా టాప్‌ హీరోలందరి సరసన నటించి తెలుగులో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిందామె. కొన్ని ఫ్లాపులు పడ్డా టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న టైమ్‌లో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ గోవా భామ చేతులు కాల్చుకుంది. అక్కడ అవకాశాలు వచ్చినా ఆశించిన సక్సెస్‌ రాలేదు. కొన్ని హిట్లు పడ్డా అవి హీరోల ఖాతాలోకి వెళ్లిపోయాయి.

    Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !

    దాంతో, నాలుగేళ్లు హిందీకే పరిమితమైన ఆమె మెట్టు దిగి తిరిగి పుట్టింటికి అదే.. టాలీవుడ్‌కు వచ్చేసింది. 2018లో రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ మూవీ అట్టర్ ఫ్లాప్‌ కావడంతో తెలుగులో మరో చాన్స్‌ రాలేదామెకు. దాంతో, పెట్టె సర్దుకొని మళ్లీ హిందీ దర్శకుల తలుపు తట్టిందామె. కానీ, ఈ రెండేళ్లలో ఇలియానాకు రెండే అవకాశాలు వచ్చాయి. లాస్ట్‌ ఇయర్ రిలీజైన పాగల్‌పంటి ఫెయిలైంది. దాంతో, ఇప్పుడు అభిషేక్ బచ్చన్‌‌తో కలిసి నటించిన ‘బిగ్‌ బుల్’పైనే ఆశలన్నీ పెట్టుకుంది ఇలియానా. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్‌‌కి రెడీ అవుతోంది. కుకీ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో అజయ్ దేవగన్, ఆనంద్ పండిట్, విక్రాంత్ శర్మ, మంగత్ నిర్మించారు.

    Also Read: వంద కోట్లతో విజయ్‌‌ దేవరకొండ మూవీ.. తప్పదు మరి..?

    వ్యాపార రంగంలో ద బిగ్ బుల్‌ గా పిలిచే ఇండియన్ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా చేసిన ఆర్థిక నేరారల ఆధారంగా తీస్తున్న సినిమా ఇది. హర్షద్ మెహతా పాత్రని అభిషేక్ బచ్చన్ పోషిస్తున్నాడు. ఇలియానా పోషిస్తున్నది ఈ స్కామ్‌‌ని వెలుగులోకి తెచ్చిన లేడీ జర్నలిస్ట్ సుచేతా దలాల్ అని సమాచారం. అక్టోబర్‌‌లో ‌ రిలీజ్ ఉంటుందని గతంలోనే ప్రకటించింది చిత్ర బృందం. షూటింగ్‌ చివరి దశకు వచ్చేసింది. అయితే, కరోనా నేపథ్యంలో ఈ మూవీని హాట్‌‌ స్టా ర్‌‌‌‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన అతి పెద్ద ఆర్థిక కుంభకోణం బ్యాక్‌‌డ్రాప్‌ తో రూపొందిన ఈ మూవీలో నటించడం ఇలియానా అదృష్టం అనొచ్చు. మరి ఈ చిత్రంతో అయినా హిందీలో ఆమె నిలదొక్కుకుంటుందో లేదో చూడాలి.