https://oktelugu.com/

తెలుగు మూవీలో కాల్‌ గర్ల్‌గా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ!

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనుంది. ‘బ్లాక్ రోస్‌’ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందే ఈ మూవీకి యువ దర్శకుడు సంపత్‌ నంది కథ, కథనం అందిస్తున్నారు. నాయికా ప్రాధాన్యం ఈ ఎమోషనల్‌ థ్రిల్లర్ సినిమాతో మోహన్‌ భరద్వాజ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాత. ఊర్వశి ప్రధాన పోషిస్తున్న ఈ మూవీ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 21, 2020 / 05:31 PM IST
    Follow us on


    బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనుంది. ‘బ్లాక్ రోస్‌’ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందే ఈ మూవీకి యువ దర్శకుడు సంపత్‌ నంది కథ, కథనం అందిస్తున్నారు. నాయికా ప్రాధాన్యం ఈ ఎమోషనల్‌ థ్రిల్లర్ సినిమాతో మోహన్‌ భరద్వాజ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాత. ఊర్వశి ప్రధాన పోషిస్తున్న ఈ మూవీ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ అందాల తార ఊర్వశి కాల్‌ గర్ల్‌ పాత్ర పోషిస్తుందని సమాచారం. విలియమ్ షేక్‌ స్పియర్ ‘ద మర్చంట్‌ ఆఫ్‌ వెనీస్’లోని షైలాక్‌ క్యారెక్టర్ స్ఫూర్తితో సంపత్‌ ఈ కథను రెడీ చేశాడని తెలుస్తోంది. కేవలం ఊర్వశిని దృష్టిలో ఉంచుకొని మొత్తం కథ రాశాడు. ఈ చిత్ర షూటింగ్‌ ఈ మధ్యే హైదరాబాద్‌లో మొదలైంది. ఊర్వశి కూడా మంగళవారం నుంచి సెట్స్‌కు వస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్‌లో క్రేజ్‌ఉన్న నటి తెలుగు సినిమాకు ఒప్పుకోవడమే కాకుండా… కాల్‌ గర్ల్‌ పాత్ర చేస్తుందంటే ఈ ప్రాజెక్టుపై అప్పుడే ఆసక్తి మొదలైంది.

    Also Read: వంద కోట్లతో విజయ్‌‌ దేవరకొండ మూవీ.. తప్పదు మరి..?

    కాగా, ఈషా రెబ్బాను కాల్‌ గర్ల్‌గా చూపిస్తూ సంపత్‌ ఇది వరకు ఓ వెబ్‌ సిరీస్‌ ప్లాన్‌ చేశాడు. అతని దగ్గర పని చేసిన అశోక్‌ దర్శకత్వం వహించనున్నాడు. అయితే, వెబ్‌ సిరీస్‌కు ఈషా రెబ్బా భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో సంపత్‌ ఆమె స్థానంలో ఊర్వశి రౌతేలాను దింపాడని, వెబ్‌ సిరీస్‌ను కాస్త సినిమాగా మార్చేశాడన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అలాగే, ‘బ్లాక్‌ రోస్‌’ వేరు, వెబ్‌ సిరీస్‌ వేరు అని మరికొందరు అంటున్నారు. రెండు ప్రాజెక్టులు ఉంటాయని చెబుతున్నారు. దీనిపై సంపత్‌ మాట్లాడితే గానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఇదిలా ఉంచితే ఊర్వశి పేరు చాలా కాలంగా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ కోసం ప్రొడ్యూసర్స్‌ ఆమెను సంప్రదించారన్న వార్తలు వస్తున్నాయి.