Good Bad Ugly and Jatt : కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ అద్భుతంగా ఉంటాయి, కానీ లాంగ్ రన్ లో మాత్రం ఓపెనింగ్స్ లో ఉన్నంత ఊపు ఉండదు, కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ లాంగ్ రన్ మాత్రం భీభత్సంగా ఉంటుంది. ఇలాంటి ఉదాహరణలు గతంలో మనం ఎన్నో చూసాము. ఇప్పుడు ఒకే రోజున విడుదలైన రెండు పెద్ద సినిమాల విషయం లో చూస్తున్నాం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తమిళ స్టార్ హీరో అజిత్(Thala Ajith) హీరో గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం, అదే బ్యానర్ లో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) నటించిన ‘జాట్’ చిత్రం(Jaat Movie) ఒకే రోజున విడుదల అయ్యాయి. ఓపెనింగ్స్ విషయంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి ‘జాట్’ కంటే 5 రెట్లు ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిన్నటి వరకు ఇదే రేంజ్ ఊపుని కొనసాగించింది ఈ చిత్రం.
Also Read : 2 రోజుల్లో 80 కోట్లు..చరిత్ర తిరగరాసిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’!
కానీ నేడు మాత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం పై పూర్తి స్థాయిలో లీడింగ్ తీసుకుంది జాట్ చిత్రం. బుక్ మై షో యాప్ లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి గంటకు 4 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతుంటే, ‘జాట్’ చిత్రానికి ఏకంగా 8 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అంటే రెండు రెట్లు ఎక్కువ అన్నమాట. ‘జాట్’ చిత్రానికి బుక్ మై షో యాప్ లో మొదటి రోజు ఎలాంటి ట్రెండ్ ఉండేదో, నేడు కూడా అలాంటి ట్రెండ్ ఉన్నది. ట్రేడ్ పండితులు చెప్తున్నది ఏమిటంటే కచ్చితంగా ఈ చిత్రానికి నేడు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని అంటున్నారు. వర్కింద డే ఈ రేంజ్ ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు. అది కూడా సన్నీ డియోల్ నేటి తరం సూపర్ స్టార్స్ క్యాటగిరీలో లేడు. సీనియర్ హీరో అయినప్పటికీ కూడా ఈ రేంజ్ వసూళ్లు వస్తున్నాయంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కి ‘జాట్’ కి మధ్యన వర్కింగ్ డే లో ఆ రేంజ్ తేడా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. నార్త్ మార్కెట్ అంటే దాదాపుగా 15 రాష్ట్రాలకు పైగా సంబంధించినది. ‘జాట్’ చిత్రం అన్ని రాష్ట్రాల్లోనూ అద్భుతమైన థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటుంది. కానీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి తమిళనాడు లో తప్ప, ఎక్కడా భారీ వసూళ్లు వచ్చే స్కోప్ లేదు. అందుకే వర్కింగ్ డే లో జాట్ చిత్రం పూర్తిగా లీడింగ్ తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘జాట్’ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 100 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాలి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ వారం లో వంద కోట్ల మార్కుని అందుకునే అవకాశం ఉంది.
Also Read : 2 రోజుల్లో 2 లక్షల టిక్కెట్లు..ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తున్న ‘జాట్’ వసూళ్లు!