Homeఎంటర్టైన్మెంట్క్రైమ్ ని చేధించే ఐ ఐ టి ముంబై జీనియస్ కృష్ణమూర్తి

క్రైమ్ ని చేధించే ఐ ఐ టి ముంబై జీనియస్ కృష్ణమూర్తి

IIT Krishnamurthy
అమెజాన్ ప్రైమ్ లో త్వరలో స్ట్రీమ్ గా నున్న క్రైమ్ థ్రిల్లర్ ఐ ఐ టి కృష్ణ మూర్తి. పృథ్వి దండమూడి, మైరా దోషి హీరో హీరోయిన్లుగా తెరకెక్కగా, శ్రీ వర్ధన్ దర్శకత్వం వహించారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయగా ఆసక్తి రేపుతోంది. ముంబైలో ఐ ఐ టి లో చదువుతున్న కృష్ణమూర్తి హైదరాబాద్ లో తప్పిపోయిన తన బాబాయ్ ని వెతుక్కుంటూ వస్తాడు. జాడ తెలియని బాబాయ్ కోసం, కృష్ణమూర్తి వెతికే క్రమంలో ఎదురయ్యే ప్రతిఘటనల సమాహారమే ఈ చిత్రం అని తెలుస్తుంది.

Also Read: సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’ ఫస్ట్‌ లుక్..

ఐ ఐ టి జీనియస్ గా తన బాబాయ్ మిస్సింగ్ కేసును అతడు, స్వయంగా ఎలా చేధించాడు అనేదే సినిమాలో ఆసక్తికర అంశమని అర్థం అవుతుంది. బాబాయ్ కోసం వెతికే క్రమంలో కృష్ణమూర్తి ఎదుర్కొన్న ఇబ్బందులు, పెద్దవాళ్లతో గొడవలు వంటివి వాటిని కృష్ణమూర్తి ఒంటరిగా ఎలా ఎదిరించాడో ఐ ఐ టి కృష్ణమూర్తి మూవీలో చూడవచ్చు.

Also Read: బిగ్ బాస్ ఫినాలే గెస్ట్ లిస్ట్ లో ఎన్టీఆర్, మహేష్, చరణ్..!

మొత్తంగా ఐ ఐ టి కృష్ణమూర్తి ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. నూతన హీరో పృథ్వి దండమూడి నటన ఆకట్టుకుంటుంది. దర్శకుడు శ్రీ వర్ధన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా మలిచాడు అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమరన్ బీజీఎమ్ ఆకట్టుకుంది. ప్రసాద్ నేకూరి ఈ చిత్రాన్ని నిర్మిచడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

IIT Krishnamurthy Trailer | Prudhvi Dandamudi | Maira Doshi | Sree Vardhan | Telugu FilmNagar

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version