https://oktelugu.com/

ఐఫోన్లు కొన్నవారికి గుడ్ న్యూస్.. ఫ్రీగా స్క్రీన్ల రీప్లేస్‌మెంట్..?

యాపిల్ కంపెనీ ఐఫోన్లు కొన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉచితంగా స్క్రీన్ల రీప్లేస్‌మెంట్‌ చేయడానికి సిద్ధమైంది. అయితే ఐఫోన్లు కొన్న ప్రతి ఒక్కరూ స్క్రీన్ల రీప్లేస్‌మెంట్‌ పొందలేరు. సమస్యాత్మక 11 మోడల్ ఫోన్లకు మాత్రం స్క్రీన్ల రీప్లేస్‌మెంట్ చేస్తున్నట్టు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఐఫోన్ 11 మోడళ్లలో టచ్ స్క్రీన్ కు సంబంధించి సమస్యలు వస్తున్నట్టు యాపిల్ సంస్థకు ఫిర్యాదులు వస్తున్నాయి. 2019 సంవత్సరం నవంబర్ నెల నుంచి 2020 సంవత్సరం మే నెల మధ్య కాలంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 5, 2020 / 07:25 PM IST
    Follow us on


    యాపిల్ కంపెనీ ఐఫోన్లు కొన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉచితంగా స్క్రీన్ల రీప్లేస్‌మెంట్‌ చేయడానికి సిద్ధమైంది. అయితే ఐఫోన్లు కొన్న ప్రతి ఒక్కరూ స్క్రీన్ల రీప్లేస్‌మెంట్‌ పొందలేరు. సమస్యాత్మక 11 మోడల్ ఫోన్లకు మాత్రం స్క్రీన్ల రీప్లేస్‌మెంట్ చేస్తున్నట్టు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఐఫోన్ 11 మోడళ్లలో టచ్ స్క్రీన్ కు సంబంధించి సమస్యలు వస్తున్నట్టు యాపిల్ సంస్థకు ఫిర్యాదులు వస్తున్నాయి.

    2019 సంవత్సరం నవంబర్ నెల నుంచి 2020 సంవత్సరం మే నెల మధ్య కాలంలో తయారైన ఐ ఫోన్ మోడళ్లను మాత్రం రీప్లేస్‌మెంట్ చేయనున్నట్టు యాపిల్ సంస్థ ప్రకటించింది. డిస్‌ప్లే మాడ్యూల్‌ లో సమస్యల వల్ల యాపిల్ వినియోగదారులకు సమస్య తలెత్తుతోందని సంస్థ తెలిపింది. కొన్ని ఐఫోన్లలో సరిగ్గా టచ్ పని చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని అందువల్లే స్క్రీన్ల రీప్లేస్‌మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని యాపిల్ సంస్థ తెలిపింది.

    ఐ ఫోన్ 11 ఫోన్ ను వినియోగించే కస్టమర్లు తమ ఫోన్ కు సమస్య ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. సీరియల్ నంబర్ చెకర్ అనే ఆప్షన్ సహాయంతో ఐఫోన్ మోడల్ కు స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కు అర్హత ఉందో లేదో సులభంగా తెలుస్తుంది. యాపిల్‌ వెబ్‌సైట్‌లో రీప్లేస్‌మెంట్‌‌ ప్రోగ్రామ్ ‌లో సీరియల్ నంబర్ ను ఎంటర్ చేస్తే కస్టమర్లకు తమ ఫోన్లకు స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌‌ కు అర్హత ఉందో లేదో తెలుసుకోవచ్చు.

    మీ ఐఫోన్ 11 మోడల్ కు అర్హత ఉంటే వెంటనే సమీపంలోని యాపిల్ స్టోర్ కు వెళ్లి ఉచితంగా స్క్రీన్ ను రీప్లేస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పటికే స్క్రీన్ ను మార్చుకుని ఉంటే వారికి యాపిల్ సంస్థ రిఫండ్ ఇవ్వనుంది. యాపిల్ టచ్ స్క్రీన్ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.