https://oktelugu.com/

బీజేపీలోకి జానారెడ్డి ప్రచారంపై ‘బండి’ ఏమన్నారంటే..!

గ్రేటర్లో హోరాహోరాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఒకప్పుడు జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకొని హైదరాబాద్ నగరాన్ని పాలించిన కాంగ్రెస్ తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ పదవీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే..! Also Read: ఎంఐఎంతో పొత్తుపై కేసీఆర్ వ్యూహాత్మక మౌనం! ఉత్తమ్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై జోరుగా చర్చ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 5, 2020 / 07:25 PM IST
    Follow us on

    గ్రేటర్లో హోరాహోరాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఒకప్పుడు జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకొని హైదరాబాద్ నగరాన్ని పాలించిన కాంగ్రెస్ తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ పదవీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే..!

    Also Read: ఎంఐఎంతో పొత్తుపై కేసీఆర్ వ్యూహాత్మక మౌనం!

    ఉత్తమ్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై జోరుగా చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

    త్వరలో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక రానుంది. దీంతో బీజేపీ నేతలు ఇప్పటి నుంచి నాగార్జున్ సాగర్ పై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నాగార్జున్ సాగర్లో బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డితో ఇప్పటికే బీజేపీ నేతలు మాట్లాడినట్లు తెలుస్తోంది. కుమారుడితోపాటు జనారెడ్డి సైతం బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: జేసీ ఫ్యామిలీని టీడీపీలో వెలివేస్తున్నారా?

    ఈ ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తనకు జానారెడ్డి నుంచి ఫోన్ కాల్ రాలేదని.. అయితే జానారెడ్డి.. ఆయన కుమారుడు వేర్వేరు కాదని జానారెడ్డి చేరికపై బండి సంజయ్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. జానారెడ్డి బీజేపీలో చేరితే రఘువీర్ రెడ్డి టికెట్ ఇచ్చే అవకాశాలు మొండుగా ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఫలితాన్నే రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో బీజేపీ ఆకర్ష్ నాగార్జున్ సాగర్లో ఇప్పటికే మొదలైంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్