https://oktelugu.com/

Deepika Padukone: సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్.. ‘దీపికా పడుకోణె’కి ఏమైంది ?

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘దీపికా పడుకోణె’ అసలు గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు ఒప్పుకుంటుంది. పెళ్లి అయినా.. ఫ్యామిలీ లైఫ్ ను త్యాగం చేసి మరీ, వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలడం లేదు. పైగా పెళ్లి అయ్యాకే ఫుల్ బిజీ అయిపోయింది ఈ భామ. అయితే, ఇంత బిజీగా ఉన్న అమ్మడు ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. దీపికా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మానసిక ఆరోగ్య స్థితి గురించి […]

Written By:
  • Shiva
  • , Updated On : August 6, 2022 / 04:18 PM IST
    Follow us on

    Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘దీపికా పడుకోణె’ అసలు గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు ఒప్పుకుంటుంది. పెళ్లి అయినా.. ఫ్యామిలీ లైఫ్ ను త్యాగం చేసి మరీ, వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలడం లేదు. పైగా పెళ్లి అయ్యాకే ఫుల్ బిజీ అయిపోయింది ఈ భామ. అయితే, ఇంత బిజీగా ఉన్న అమ్మడు ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. దీపికా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మానసిక ఆరోగ్య స్థితి గురించి చెప్పుకొచ్చింది.

    Deepika Padukone

    ‘దీపికా పడుకోణె’ మాటల్లోనే.. ‘నటిగా నా కెరీర్‌ చాలా బాగుండేది. కానీ నాకెందుకో బాధగా ఉండేది. ఆ బాధకు కారణం తెలిసేది కాదు. అప్పుడు నాకు ఎక్కువగా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చేవి. అప్పుడు మా అమ్మ ఇచ్చిన దైర్యం వల్లే ఇప్పుడు ఇలా ఉన్నానని చెప్పుకొచ్చింది. నిజానికి గతంలో కూడా తన సూసైడ్ గురించి దీపికా చెప్పింది. కానీ తాజాగా మళ్లీ ఈ బ్యూటీ ఈ విషయం గురించి చెప్పింది.

    Also Read: Pushpa 2 OTT Rights: ‘పుష్ప 2’ కోసం ఓటీటీ సంస్థలు పోటీ.. సంచలన రికార్డులు

    అలాంటి స్థితిలో నుంచి ‘దీపికా పడుకోణె’ మళ్లీ నిలదొక్కుకుని స్టార్ హీరోయిన్ గా నిలబడింది. హీరో రణవీర్ సింగ్ ను పెళ్లి కూడా చేసుకుంది. అయితే, ఈ బాలీవుడ్ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. ఆ మధ్య గెహ్రాహియా అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది.

    ఆ సినిమాలో గ్లామర్‌ డోస్‌ పెంచిన దీపికాను చూసి అందరూ షాక్ అయ్యారు. ఇదేమిటి ? దీపికా మరీ ఇంత పచ్చిగా రెచ్చిపోయింది ఏమిటి ? అంటూ నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెట్టారు. ఏది ఏమైనా దీపికా మాత్రం రెచ్చిపోతుంది. ప్రస్తుతం దీపక చేతిలో ఏకంగా ఆరు సినిమాలున్నాయి అంటేనే అర్ధం చేసుకోవచ్చు. దీపికా ఎంతలా సినిమాల కోసం తాపత్రయ పడుతుందో.

    Deepika Padukone

    కియారా లాంటి యంగ్ బ్యూటీకి కూడా ఇన్ని సినిమాలు లేవు. వాళ్ళు కూడా వచ్చిన సినిమా అలా చేయకుండా పర్సనల్ లైఫ్ లో కాస్త స్పెస్ ను ఉంచుకుంటున్నారు. అయితే, దీపికా వరుసగా సినిమాలు అయితే ఒప్పుకుంటుంది గానీ, అసలు ఆమె అన్ని సినిమాలకు కరెక్ట్ గా డేట్స్ ఇవ్వగలదా ? ఎందుకంటే దీపికా చేస్తోన్న సినిమాలు అన్ని భారీ సినిమాలే. ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా దీపికా మాత్రం సినిమాలకు గ్యాప్ ఇచ్చేలా లేదు.

    Also Read:Bimbisara – Sita Ramam: సీతారామం, బింబిసార‌ పేరు గొప్ప ఊరు దిబ్బ ఎందుకు? కారణం ఏమిటి?

     

    Tags