Photo Story : ఈ ఫొటోలో కనిపిస్తున్న బుడ్డోడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెడుతారు..!

సచిన్ చిన్నప్పటి పాత్ర కోసం ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ ఇర్కిన్ దాదాపుగా మూడు వందల మందిని ఆడిషన్ చెయ్యగా వారిలో మిఖైల్ గాంధీ ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు.

Written By: Vicky, Updated On : April 30, 2023 8:38 am
Follow us on

Photo Story : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది బాలనటులు తమ అద్భుతమైన నటన తో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి ఎన్నో అవార్డులు మరియు రివార్డులు అందుకున్నారు, కొంతమంది బాల నటులు అయితే జాతీయ స్థాయి పురస్కారాలు కూడా అందుకున్నారు.ఈ వయసులో ఇంత అద్భుతంగా ఎలా చెయ్యగలరు అని సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసిన నటీనటులు ఎందరో, వారిలో ఒక్కరు మిఖైల్ గాంధి.ఈ బుడ్డోడు మన అందరికి సుప్రీమ్ సినిమా ద్వారా పరిచయం,ఈ సినిమాలో ఈ సాయి ధరమ్ తేజ్ ఒక్క హీరో అయితే , మిఖైల్ గాంధీ మరో హీరో, అంత చిన్న వయస్సులోనే కథలో అంత కీలకమైన పాత్ర పోషించడం అంటే మాటలు కాదు.ఈ సినిమా తర్వాత ఈ కుర్రోడికి తెలుగు లో ఆఫర్ల వెల్లువ కురిసింది, అయితే ఈ బుడ్డోడు గురించి ఇటీవల బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి, అవి ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

మన అందరికి ఈ బుడ్డోడు సుప్రీమ్ సినిమా ద్వారా మాత్రమే తెలుసు, కానీ ఇతను సుప్రీమ్ సినిమాకి ముందు ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించాడు, ఇతను అంతకు ముందు రస్నా , కిండర్ జాయ్ ,మరియు లైఫ్ బాయ్ సోప్ వంటి ప్రముఖ టాప్ బ్రాండ్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన యాడ్స్ లో నటించాడు.ఇక ఈ బుడ్డోడు వెండితెర కి పరిచయం అయ్యింది మాత్రం లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ ద్వారా, ఇందులో సచిన్ చిన్నప్పటి పాత్ర కోసం ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ ఇర్కిన్ దాదాపుగా మూడు వందల మందిని ఆడిషన్ చెయ్యగా వారిలో మిఖైల్ గాంధీ ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు. తన యాక్టింగ్ స్కిల్స్ తోనే కాకుండా చిన్నప్పటి సచిన్ పాత్రకి తగ్గట్టు మిఖైల్ ఉండడం, అతనికి ఉన్న జుట్టు కూడా సచిన్ ని పోలి ఉండటం తో వెంటనే వేరే ఆలోచన లేకుండా మిఖైల్ గాంధీని సెలెక్ట్ చేసుకున్నాడు ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ ఇర్కిన్.సచిన్ లాంటి క్రికెటర్ జీవిత చరిత్ర తమ కొడుకుని తీసుకున్నందుకు మిఖైల్ గాంధీ తల్లి తండ్రుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది, ఇవి అన్ని ఒక్క ఎత్తు అయితే సచిన్ టెండ్యూల్కర్ ఆ సినిమా విడుదల అయినా తర్వాత మిఖైల్ గాంధీని తన ఇంటికి పిలిపించుకొని మరి అతనిని పొగడతలతో ముంచి ఎత్తాడు.

ఇక మిఖైల్ గాంధీ వ్యక్తిగత విషయానికి వస్తే ఇతను వయస్సు 10 సంవత్సరాలు, ఇతని తల్లి పేరు యాస్మిన్ గాంధీ మరియు తండ్రి పేరు సిరాజ్ గాంధీ, ఇతను ప్రస్తుతం మంకెజి కూపర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్కూల్ లో చదువుకుంటున్నాడు, ఇతను తెలుగు లో బాల నటుడిగా సుప్రీమ్ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ హీరో గా వచ్చిన రెండవ సిఎంమా హలో లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు, ఈ సినిమాలో కూడా ఈ బుడ్డోడి పాత్రకి మంచి పేరు వచ్చింది, ఇక ఈ సినిమా తర్వాత 2018 వ సంవత్సరం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన భరత్ అనే నేను సినిమాలో కూడా నటించాడు, ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక 2019 వ సంవత్సరం లోన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయినా టైపు రైటర్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు, వీటితో పాటు ఈ బుడ్డోడికి బాలీవుడ్ మరియు టాలీవుడ్ లాలలో ఆఫర్ల వెల్లువ కురుస్తోంది, బాలీవుడ్ లో ఈ బుడ్డోడు ఇప్పుడు వరుసగా 5 సినెమాలో బుక్ అయ్యాడు.ఇంత చిన్న వయస్సులో ఒక్క పక్క చదువుకుంటూనే మరో పక్క సినిమాలు చేస్తూ 8 సంవత్సరాల వయస్సు నుండే సంపాదించడం మొదలు పెట్టాడు, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ బుడ్డోడి రెమ్యూనరేషన్ ఇండియా లో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్స్ అందరి కంటే ఎక్కువ అట.