https://oktelugu.com/

Akhil – Amala : అఖిల్ సినీ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆయన తల్లి అమల యేనా..!

అయితే అఖిల్ భవిష్యత్తు పై ప్రముఖ జోతిష్యుడు వేణు గోపాల స్వామి లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : April 30, 2023 / 08:25 AM IST
    Follow us on

    Akhil – Amala : అక్కినేని కుటుంబం నుండి ఇండస్ట్రీ కి భారీ అంచనాలతో లాంచ్ అయిన హీరో అక్కినేని అఖిల్. హాలీవుడ్ హీరో ని తలపించే స్క్రీన్ ప్రెజెన్స్, కష్టపడే తత్త్వం ఉన్నా కూడా , ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన దగ్గర నుండి నేటి వరకు ఇతని కెరీర్ లో ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేకపోవడం బాధాకరం.

    మొన్ననే ఆయన హీరో గా నటించిన భారీ బడ్జెట్ స్పై యాక్షన్ చిత్రం ‘ఏజెంట్’ గ్రాండ్ గా విడుదలై మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోతుంది.చాలా ప్రాంతాలలో ఈ చిత్రానికి రెండవ రోజు జీరో షేర్స్ వచ్చాయి. ఒక భారీ చిత్రం ఈ రేంజ్ లో పడిపోవడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు.అందుకే ఇప్పుడు అఖిల్ కెరీర్ డైలమా లో పడింది.

    అయితే అఖిల్ భవిష్యత్తు పై ప్రముఖ జోతిష్యుడు వేణు గోపాల స్వామి లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘అఖిల్ కెరీర్ ఇలా సాగడానికి కారణం నాగ దోషమే, ఆ అబ్బాయి జాతకం అసలు ఏమాత్రం బాగాలేదు.అతని పై తల్లి ప్రభావం ఎక్కువ ఉంది.

    ఆమె లేకుండా అఖిల్ ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకొని సినిమాలు చేస్తాడో, అప్పుడే ఆయన సక్సెస్ కాగలదు, అప్పటి వరకు ఆయనకీ ఇలాంటి ఫ్లాప్స్ వస్తూనే ఉంటాయి’ అంటూ వేణు గోపాల స్వామి ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.ఏది ఏమైనా అఖిల్ గురించి అభిమానులు చాలా బాధపడుతున్నారు, తాను పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదని, ఇలాంటి ఫలితాలకు ఆయన అర్హుడు కాదని వాపోతున్నారు. మరి అఖిల్ భారీ హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి.