Prabhas: ప్రభాస్ తో చేసే సినిమాలో ఆ ఒక్క తప్పు చేయకపోతే చాలు…

ప్రభాస్ తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే భారీ వసూళ్లను రాబట్టిన సినిమా బాహుబలి 2...ఈ సినిమా దాదాపు 2000 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ఇండియన్ సినిమా

Written By: Gopi, Updated On : April 10, 2024 1:48 pm

Prabhas spirit movie updates

Follow us on

Prabhas: ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ఒకే ఒక హీరో ప్రభాస్.. ఇప్పటివరకు ఈయన చేసిన చాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో 300 కోట్లకు పైన భారీ వసూళ్లను కలెక్ట్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ప్రభాస్ గత సంవత్సరం ఎండింగ్ లో సలార్ సినిమాతో వచ్చి దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి 2023 వ సంవత్సరంలో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఆ సినిమా కూడా నిలవడం అనేది ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ప్రభాస్ తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే భారీ వసూళ్లను రాబట్టిన సినిమా బాహుబలి 2…ఈ సినిమా దాదాపు 2000 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది…ఇక ఇప్పుడు ప్రభాస్ మరికొన్ని కొత్త సినిమాలు లైన్ లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే రాజాసాబ్, కల్కి లాంటి సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పిరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఒక సినిమాని చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యాడు.

సీతారామం సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక పిరియాడికల్ సినిమాని చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఏ స్టార్ హీరోతో కూడా సినిమా చేయలేని హను రాఘవపూడి ప్రభాస్ చరిష్మాని ఎలా వాడుకుంటాడు. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి హను రాఘవపూడి డైరెక్షన్ లో పెద్దగా కొత్తదనం అయితే ఏమీ ఉండదు. ఇక ఇంతకు ముందు ఆయన సినిమాల్లో సెకండ్ హాఫ్ లో స్టోరీ చాలా వీక్ ఉంటుంది అనే ఒక బ్యాడ్ నేమ్ అయితే ఆయన మీద ఉండేది. కానీ సీతారామం సినిమాలో దానిని అధిగమించి మరి సినిమాని సక్సెస్ చేసి చూపించాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.

కానీ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఆయన కటౌట్ ని వాడుకొని కొన్ని మాస్ ఎలివేషన్స్ ను ఇస్తేనే ఆయన ఈ సినిమా నుంచి బయటపడతాడు. లేకపోతే మాత్రం ప్యూర్ లవ్ స్టోరీ గా ఈ సినిమాని నడిపిస్తే ఈ సినిమా మరొక రాధే శ్యామ్ అవుతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ తప్పు చేయకుండా ప్రభాస్ లో ఉన్న మాస్ ఎలివేషన్స్ ని కూడా అక్కడక్కడ వాడుకుంటూ ముందుకెళ్తేనే ఆయన సక్సెస్ అవుతాడు అనేది మాత్రం వాస్తవం…