https://oktelugu.com/

Directors: టీజర్ అని చెప్పి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్న డైరెక్టర్స్..ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. అసలు గ్లిమ్స్, టీజర్ కి తేడా ఏంటి..?

అయితే ఇప్పుడు మేకర్స్ అందరూ గ్లిమ్స్ అని చెప్పి టీజర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. టీజర్ అని చెప్పి గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుల్లో కొంతవరకు వరకు ఆందోళన అయితే కలుగుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 10, 2024 / 01:43 PM IST

    difference between Glimpse and Teaser

    Follow us on

    Directors: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా మీద హైప్ ని తీసుకురావాలి అంటే మొదట ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని వదులుతారు. ఆ తర్వాత ఒక గ్లిమ్స్ ని, ఆ తర్వాత టీజర్ ని, సినిమా రిలీజ్ కి ఒక వారం ముందు ట్రైలర్ ని వదులుతారు. ఈ ప్రాసెస్ అంత జరిగిన తర్వాత అప్పుడు సినిమాను థియేటర్ లోకి తీసుకొస్తారు. ఇక ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తారు అంటే సినిమా మీద ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయడానికి అలాగే మేము తీసిన ప్రాజెక్ట్ ఇలా ఉండబోతుందని ఆ సినిమా తాలూకు ఇంటెన్షన్ ని తెలియజేయడం కోసమే వీటిని రిలీజ్ చేస్తూ ఉంటారు.

    అయితే ఇప్పుడు మేకర్స్ అందరూ గ్లిమ్స్ అని చెప్పి టీజర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. టీజర్ అని చెప్పి గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుల్లో కొంతవరకు వరకు ఆందోళన అయితే కలుగుతుంది. అసలు టీజర్ కి, గ్లిమ్స్ కి, ట్రైలర్ కి మధ్య ఉన్న తేడాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

    గ్లిమ్స్ అంటే 50 సెకండ్ల నుంచి ఒక నిమిషం 20 సెకండ్ల వరకు ఉంటే దాన్ని గ్లిమ్స్ గా పరిగణిస్తారు. ఇక సినిమాకు సంబంధించిన ఒక హింట్ ను ఇస్తు చిన్నగా దీన్ని రిలీజ్ చేస్తే సరిపోతుంది.ఇందులో డైలాగు ఉన్న లేకపోయిన పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇక టీజర్ అంటే ఒక నిమిషం 20 సెకండ్ల నుంచి రెండు నిమిషాల లోపు ఉంటుంది. ఇందులో తప్పకుండా సినిమాకు సంబంధించిన డైలాగులని వదులుతూ సినిమా మీద హైప్ ని పెంచే ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఇక ట్రైలర్ అంటే రెండు నిమిషాల పైన ఉంటుంది…కానీ ఇప్పుడున్న మేకర్స్ మాత్రం టీజర్ అని చెప్పి ఒక నిమిషం వీడియోని రిలీజ్ చేస్తున్నారు. అదే గ్లిమ్స్ అని చెబుతూ ఒక నిమిషం 20 సెకండ్లు ఉండే వీడియోలను రిలీజ్ చేస్తున్నారు.

    ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 టీజర్ కూడా ఒక నిమిషం మూడు సెకన్లు మాత్రమే ఉంది. అంటే దీనిని మనం గ్లిమ్స్ గా పరిగణించాలి కానీ సినిమా యూనిట్ మాత్రం టీజర్ అని చెప్పి రిలీజ్ చేశారు. ఇక గ్లిమ్స్ మాదిరిగానే ఇందులో డైలాగులు కూడా ఏమీ పెట్టలేదు. కాబట్టి దీన్ని గ్లిమ్స్ గానే పరిగణించాలి. ఇక ఈ విషయంలో హీరోల అభిమానులు గాని, సగటు ప్రేక్షకులు గాని సినిమా మేకర్స్ మమ్మల్ని మోసం చేస్తున్నారు అంటూ వాళ్ల మీద ఫైర్ అవుతున్నారు…