Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా ఒక పది నిమిషాల నిడివి గల వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ పై తీవ్రమైన నెగటివిటీ ని పెంచేలా చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై అసెంబ్లీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ ఆరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టడం పై పలువురు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసారు. కోర్టులో కేసు నడుస్తుండగా, A11 ముద్దాయిగా పరిగణింపబడ్డ అల్లు అర్జున్, ఆ అంశంపై ప్రెస్ మీట్ లు పెట్టడం చట్టా రీత్యా నేరమని , ఈ బెయిల్ ని రద్దు చేయడం కోసం సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లేందుకు కూడా హైదరాబాద్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
ఇదంతా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మైన్ తిరుపతి అల్లు అర్జున్ కేసు వ్యవహారం పై మాట్లాడుతూ ‘అల్లు అర్జున్, పోలీసులు పరస్పరం విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కోర్టు లో తప్పుడు ఆధారాలు ఇస్తే ఆయన బెయిల్ రద్దు అవుతుంది. నిజాలను నిగ్గు తేల్చేందుకు అల్లు అర్జున్ ని పోలీసులు విచారిస్తున్నారు. సీన్ రీ క్రియేట్ చేయడం కోసం ఆయన్ని సంధ్య థియేటర్ కి కూడా తీసుకెళ్లారు’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. సుమారుగా రెండు గంటల పాటు అల్లు అర్జున్ ని విచారించిన పోలీసులు, అనంతరం ఆయన్ని హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి తీసుకెళ్లారు. ఇంతకీ అల్లు అర్జున్ పోలీసుల విచారణ లో ఏమి చెప్పాడు, అసలు ఏ కోణం లో విచారించారు అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మీడియా లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఈ వ్యవహారం లో అల్లు అర్జున్ ని సపోర్టు చేసేవాళ్ళు ఉన్నారు, అదే విధంగా అల్లు అర్జున్ తీవ్రంగా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం మంది విమర్శించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి జనాల్లో ఉండేది. కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ప్రీమియర్ షో రోజు వ్యవహరించిన తీరుని పూసగుచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా వివరించాడు. దీంతో అల్లు అర్జున్ పై సానుభూతి పోయి, ఘోరమైన నెగటివిటీ పెరిగింది. అక్కడితో మ్యాటర్ ని వదిలేసి ఉండుంటే బాగుండేది. కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల విషయం తారా స్థాయికి చేరింది.దీంతో ఆయన ఇంటి పై ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన జేఏసీ నాయకులు రాళ్లతో దాడి చేయడం వంటి ఘటనలు జరిగాయి. గత రెండు వారాలుగా ఇదే టాపిక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా లో నడుస్తుంది.