RRR: బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో రాజమౌళి రేంజ్ మారిపోయింది. నిజానికి ఆ రెండు చిత్రాలు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడం ఒక సాహసం. ఎందుకంటే.. అప్పటికి టాలీవుడ్ చిత్రాలకు ఇతర పరిశ్రమల్లో మార్కెట్ లేదు. వంద కోట్ల షేర్ వసూలు చేయడం అంటే గొప్ప విషయం. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మిన రాజమౌళి బాహుబలి సిరీస్ చేసి సక్సెస్ అయ్యారు. చాలా మంది సౌత్ హీరోలు, దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు.
బాహుబలి 2 అనంతరం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఈ మూవీ సైతం భారీ విజయం అందుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఈ మల్టీస్టారర్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జపాన్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది గోల్డెన్ గ్లొబ్, ఆస్కార్ వంటి అంతర్జాతీయ అవార్డులను ఆర్ ఆర్ ఆర్ సొంతం చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇమేజ్ వారు ఊహించని స్థాయికి వెళ్ళింది.
కాగా ఈ చిత్రంలో భాగం కానందుకు ఓ బడా స్టార్ అసహనం వ్యక్తం చేశాడు. ఆర్ ఆర్ ఆర్ లో నాకు అవకాశం ఇవ్వాలని మీకు అనిపించలేదా అన్నాడు. ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్. రాధే శ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి-ప్రభాస్ చిట్ చాట్ సెషన్ లో పాల్గొన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ.. చరణ్, తారక్ వంటి ఇద్దరు సూపర్ స్టార్స్ తో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నావ్ బాగానే ఉంది.
నాకు చిన్న గెస్ట్ రోల్ ఇవ్వాలని మీకు అనిపించలేదా. నేను, తారక్, చరణ్ కనిపిస్తే బాగుండేది కదా. మీ ఉహల్లో నేను కనిపించలేదా? అన్నారు. ఈ ప్రశ్నకు రాజమౌళి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. నువ్వు షిప్ లాంటోడివి. ఆ షిప్ పెడితే సీన్ గ్రాండ్ గా వస్తుంది అనుకుంటే, నిన్ను తీసుకునేవాడిని. ప్రభాస్ మనం చెబితే చేస్తాడని నిన్ను పెడితే, సినిమా చెడిపోతుంది. అందుకే నీకు అవకాశం ఇవ్వలేదు, అన్నాడు.
అయినా నీకు నాకంటే తారక్, చరణ్ అంటే ఎక్కువ ఇష్టంలే. గతంలో కూడా అన్ని కథలు తారక్ మీదే చెప్పేవాడివి.. అన్నాడు. నేను ఏ హీరోలతో పని చేస్తున్నానో అప్పుడు వాళ్లే నాకు అందరికంటే ఇష్టమైన హీరోలు. అందులో సందేహం లేదన్నాడు. కాబట్టి ప్రభాస్ ఆర్ ఆర్ ఆర్ లో కనీసం చిన్న రోల్ అయినా చేయాలని ఆశపడ్డాడు. మార్చిలో విడుదలైన రాధే శ్యామ్ నిరాశపరిచింది. ఇక మే లో సమ్మర్ కానుకగా విడుదలైన ఆర్ ఆర్ ఆర్ అనేక రికార్డులు బద్దలు కొట్టింది.