Koratala Siva: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక కొరటాల శివ లాంటి దర్శకుడు ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలి అనే డైలమాలో పడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దేవర సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేదు. దాంతో ఒక డిఫరెంట్ సబ్జెక్టుతో ముందుకు వెళితేనే ఆయనకు ఫ్యూచర్ అయితే ఉంటుంది. లేకపోతే మాత్రం ఇకమీదట ఆయన సినిమాలను చూసే ప్రేక్షకులు కూడా ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకునే కొంతమంది స్టార్ డైరెక్టర్లు ఎప్పటికప్పుడు వాళ్ళను వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
మరి ఇలాంటి క్రమంలో కొరటాల శివ మాత్రం రొటీన్ సినిమాలనే చేస్తున్నాడు అంటూ కొన్ని విమర్శలునైతే ఎదుర్కొంటున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయనతో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాకపోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని స్టార్ హీరో అయిన అఖిల్ తో ఆయన ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక కేవలం తెలుగులోనే రాబోతున్న ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ డైరెక్టర్ ఒక్కసారిగా డీలా పడిపోవడం అనేది అతని అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులను కూడా కొంతవరకు నిరుత్సాహపరుస్తుందనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు దాటుతున్నప్పటికి ఒక్క సక్సెస్ కూడా లేదు. మరి ఇలాంటి సందర్భంలో అఖిల్ తో కొరటాల శివ సినిమా చేసి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. మరి కమర్షియల్ సినిమాలను చేయడంలో ఆయనకు మంచి పేరైతే ఉంది. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు వెనుకబడిపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది…