https://oktelugu.com/

NTR: ఆ సినిమా సమయం లో ఎన్టీయార్ ను ట్రోల్ చేశారా..?వాళ్ళకి ఆయన ఎలా సమాధానం చెప్పాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఏ ఒక్కరి సొంతం కాదు. ఇక్కడ ప్రతి ఒక్క హీరో తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకుంటే ఇండస్ట్రీలో పైకి వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు... చూడాలి మరి రాబోయే సినిమాలతో ఇక కూడా వచ్చే హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది...

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 04:09 PM IST

    NTR

    Follow us on

    NTR: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పుడు వచ్చిన దేవర సినిమా వరకు ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. అయితే ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ను చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా రాఖీ సినిమా సమయంలో ఆయన బాడీ బీభత్సంగా పెరిగిపోవడం హెవీ వేట్ తో ఉండడం ఆయన డాన్స్ స్టెప్పులు వేస్తున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుండడంతో చాలామంది ప్రేక్షకులు ఎన్టీఆర్ పని అయిపోయింది తను మరీ లావైపోయాడు. ఇక మీదట డ్యాన్సులు, ఫైట్లు చేయడానికి కూడా అతనికి అవకాశం ఉండకపోవచ్చు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లైతే చేశారు. కానీ వాళ్ళందరికి చెక్ పెడుతూ ఆయన లైపో శేషన్ చేయించుకొని సన్నబడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగడమే కాకుండా మంచి విజయాలను అందుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంకా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది నటుల్లో చాలా మంచి నటుడు అని చెప్పాలి. ఇక రీసెంట్ గా వచ్చిన దేవర సినిమాతో భారీ సక్సెస్ ను కైవసం చేసుకోవాలని అనుకున్నప్పటికి అది వీలుపడలేదు.

    దాంతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలనుకున్న ఆయనకి కొంతవరకు ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక మీదట రాబోయే సినిమాలను చేసి మంచి విజయాలను అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో తనున్నట్టుగా తెలుస్తోంది…

    ఇక ఇదిలా ఉంటే తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి కోసం జూనియర్ ఎన్టీఆర్ విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వీలైతే పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవాలనే ఆరాటంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…

    మరి రాబోయే సినిమాతో భారీ సక్సెస్ ను అందుకొని ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇవ్వగలిగితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటాడు. లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుందనే చెప్పాలి…