Trivikram and Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన క్రేజ్ అయితే భారీగానే ఉందని చెప్పాలి. ఇక అంతకుముందు చేసిన ‘అలా వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని సంపాదించుకున్న ఆయన ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ ను డైరెక్షన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ ఒక విషయంలో తనను తాను మార్చుకోవాల్సిన అవసరమైతే ఉంది అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అది ఏంటి అంటే ఆయన ఎప్పుడూ కుటుంబం చుట్టే కథను తిప్పుతూ ఉంటాడు…అలా కాకుండా ఈసారి పాన్ ఇండియా కథను చెప్పాలి. ఇక ఈ ఒక్క విషయంలో కనక ఆయన మారితే అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్ ను కొట్టొచ్చు అని విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు.
ఇక ఆయన ఇప్పుడు లోకల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాని కాకుండా నేషనల్ వైడ్ కి కనెక్ట్ అయ్యేలా ఒక కథని రాసుకొని అల్లు అర్జున్ ని చాలా డీసెంట్ గా చూపించిన పర్లేదు లేదంటే యాక్షన్ తో కూడిన ఎపిసోడ్స్ తో చూపించిన కూడా ప్రేక్షకులు అతన్ని అంగీకరిస్తారు. అయితే త్రివిక్రమ్ ఆ బ్యాక్ డ్రాప్ ని మాత్రం మళ్లీ రొటీన్ రొట్ట ఫార్ములాలో చూపించకుండా ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో ఎంచుకొని చూపిస్తే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా ఇప్పటికే లాక్ అయినట్టుగా తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ కూడా ఆ కథకి కన్విన్స్ అయ్యారట. మరి ఎలాంటి కథతో మన ముందుకు రాబోతున్నారనే విషయంలో అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ కథ కనక నెక్స్ట్ లెవెల్ లో ఉంటే మాత్రం ఈ సినిమా ‘పుష్ప 2’ ను దాటి ఆడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
కానీ కథ మాత్రం డిసడ్వాంటేజ్ గా మారితే మాత్రం సినిమా డిజాస్టర్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కొంతమంది సినిమా విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ‘పుష్ప 2’ సినిమా తర్వాత వస్తుంది. కాబట్టి ఈ సినిమా మీద మంచి అంచానాలైతే ఉంటాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఈ సినిమాని తీస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…