https://oktelugu.com/

Tollywood Heroes: ఈ సూపర్ హిట్ సినిమాలను మన స్టార్ హీరోలతో చేస్తే బాక్సాఫీస్ షేక్ అయ్యేది…!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో యష్ అద్భుతంగా నటించడమే కాకుండా పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చాటుకున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 / 10:43 AM IST

    Tollywood Heroes

    Follow us on

    Tollywood Heroes: సినిమా ఇండస్ట్రీలో ఒక సంవత్సరం లో చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకుంటే, మరికొన్ని సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి. ఇకనిది ఇలా ఉంటే కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయిన కూడా ఆ సినిమాలను ఆ హీరోలు కాకుండా వేరే హీరోలు చేసి ఉంటే ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అయి ఉండేవని ఆ సినిమా చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సినిమాలు ఏంటో అవి ఏ హీరో చేస్తే ఇంకా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేవో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కే జి ఎఫ్
    ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో యష్ అద్భుతంగా నటించడమే కాకుండా పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చాటుకున్నాడు. అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమాని యష్ కాకుండా ప్రభాస్ చేసి ఉంటే ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్లను వసూలు చేసి ఉండేదని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు…

    ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకారాజ్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో కమలహాసన్ కాకుండా చిరంజీవి నటించినట్లయితే ఈ సినిమా దాదాపు 600 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టేది… ఎందుకంటే కమలహాసన్ కి ఈ సినిమాకి ముందు పెద్దగా మార్కెట్ లేదు.అసలు ఆయన హీరోగా సినిమాలు చేయడానికి ఏ దర్శకుడు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు.

    అలాంటి కమలహాసన్ ఈ సినిమాతో 300 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు అంటే, ఇక ఈ సినిమాను చిరంజీవి చేసినట్టయితే దాదాపు 600 కోట్ల కలెక్షన్లు ఈజీగా వచ్చుండేవి అని ట్రేడ్ పండితులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…