https://oktelugu.com/

Gas Scheme: ‘ఉజ్వల గ్యాస్‘ లబ్ధిదారులకు ‘మహాలక్ష్మి’ ఎలా వర్తిస్తుంది?

గ్యాస్ వినియోగదారులు సిలిండర్ ను బుక్ చేసుకునేటప్పడు పూర్తి ధర పూర్తిగా చెల్లించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 26, 2024 / 10:51 AM IST

    Ujwala gas Mahalaxmi Scheme gas

    Follow us on

    Gas Scheme:  ఆరు గ్యారెంటీల్లో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 లకే సిలిండర్ ను అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఫిబ్రవరి 27 నుంచి ఈ పథకంను అమలు చేయడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై లబ్ధి పొందాలంటే ముందుగానే సిలిండర్ ధరను చెల్లించాలా? లేదా రూ.500 చెల్లిస్తే సరిపోతుందా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ తరుణంలో అసలు ‘మహాలక్ష్మి’ పథకం ‘ఉజ్వల గ్యాస్’ లబ్ధిదారులకు ఎలా వర్తిస్తుంది? అనే ప్రశ్న ఎదురవుతోంది.

    గ్యాస్ వినియోగదారులు సిలిండర్ ను బుక్ చేసుకునేటప్పడు పూర్తి ధర పూర్తిగా చెల్లించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంతవరకు వినియోగదారుల్లో వస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఉన్నతాధికారుల వీడియోకాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. అంటే సిలిండర్ రూ.955 ఉంటే వినియోగదారులు దీనిని మొత్తం చెల్లించాలి. మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులు రూ.500 రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న రూ. 40 మినహా రూ.415ని రాష్ట్ర ప్రభుత్వం రాయితి కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.

    ఇక ఉజ్వల గ్యాస్ సిలిండర్లకు ఈ పథకం ఎలా వర్తిస్తుంది? అనే సందేహాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.340 రాయితీ అందిస్తోంది. అయితే మహాలక్ష్మీ పథకం వీరికి కూడా వర్తిస్తుంది. అదెలాగంటే గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకుంటే రూ.970ని చెల్లించాల్సి ఉంటుంది. ఇంుదలో రూ. 500 రాష్ట్ర ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ కింద చెల్లించాలి. కానీ వీరికి ఇప్పటికే రూ.340 రాయితీ వస్తుంది. అందువల్ల రూ.500 నుంచి రూ.340 ని తీసేసి మిగిలిన రూ.130ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లిస్తుంది. మొత్తంగా ఉజ్వల వినియోగదారులు సైతం రూ.500 పథకం లబ్ధి పొందనున్నారు.

    అయితే గ్యాస్ సిలిండర్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నాయి. అందుకు రవాణా చార్జీలే కారణం. ఈ నేపథ్యంలో రవాణా చార్జీలు మినహాయిస్తే గ్యాస్ ధరలు అంతా ఒకేలా ఉండన్నాయి. ఏదీ ఏమైనా మొత్తంగా లబ్ధిదారులకు రూ.500 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.