https://oktelugu.com/

Sainikudu: గుణశేఖర్ చేసిన ఆ తప్పుల వల్లే సైనికుడు మూవీ ప్లాప్ అయిందా..?

ఇక ఇది ఇలా ఉంటే ఒక సినిమాని సక్సెస్ చేయడానికి ఎంత టాలెంట్ అయితే కావాలో అంత టాలెంట్ ని కలిగి ఉన్న గుణశేఖర్ లాంటి డైరెక్టర్ మహేష్ బాబు తో చేసిన ' ఒక్కడు' సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : February 26, 2024 / 10:36 AM IST

    Sainikudu

    Follow us on

    Sainikudu: ఒక సినిమాని డైరెక్ట్ చేయడమంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. ముందుగా ఆ సినిమాను తీసే డైరెక్టర్ కి దర్శకత్వం శాఖలో పరిజ్ఞానం ఉండాలి. అలాగే ప్రస్తుతం సొసైటీ లో ఏం జరుగుతుందో దానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఉండాలి. మరి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారో వాళ్ల అభిరుచి ని పసిగట్టాలి. ఇక అంతకుమించి ఇప్పుడు మనం ఏ జానర్లో అయితే సినిమా చేస్తున్నామో ఆ జానర్ మీద మంచి గ్రిప్ ఉండాలి. అలాంటప్పుడే ఒక దర్శకుడు ఒక మంచి సినిమాను తీయగలడు…

    ఇక ఇది ఇలా ఉంటే ఒక సినిమాని సక్సెస్ చేయడానికి ఎంత టాలెంట్ అయితే కావాలో అంత టాలెంట్ ని కలిగి ఉన్న గుణశేఖర్ లాంటి డైరెక్టర్ మహేష్ బాబు తో చేసిన ‘ ఒక్కడు’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత వీళ్ళ కాంబో లో చేసిన ‘అర్జున్ ‘ సినిమా యావరేజ్ గా ఆడింది. ఇక మూడోసారి కలిసి చేసిన సైనికుడు మాత్రం భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. నిజానికి సైనికుడు సినిమా సబ్జెక్టు ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్…దాన్ని సరిగ్గా డీల్ చేస్తే సినిమా సూపర్ సక్సెస్ అయ్యేది.

    అయితే ఈ సినిమా కథని కనక ఒకసారి చూసుకున్నట్లయితే యూత్ రాజకీయాల్లోకి రావాలి అనే ఒక గొప్ప పాయింట్ తో ఈ సినిమాని స్టార్ట్ చేశారు. కానీ మధ్యలో ట్రీట్ మెంట్ రాసుకున్నప్పుడు చాలా తప్పులు అయితే జరిగాయి. అందులో మొదటిది హీరోయిన్ అయిన త్రిష విలన్ ని ప్రేమించడం అనేది పెద్ద మైనస్ గా మారింది. ఎందుకంటే అప్పట్లో కమర్షియల్ సినిమాలను చూసే ప్రేక్షకులు ఇలాంటి సీన్లను జీర్ణించుకోలేకపోయారు. ఇక మరీ ముఖ్యంగా గుణశేఖర్ మహేష్ బాబు కాంబో లో ఇంతకు ముందు ఒక్కడు లాంటి ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రావడం వల్ల ఆడియెన్స్ దృష్టంత మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ మీదే ఉండిపోతుంది. ఈ సినిమాలో ఎలివేషన్స్ ఇచ్చే సీన్లు ఉన్నప్పటికీ వాటిని దర్శకుడు సరిగ్గా డీల్ చేయలేకపోయాడు.

    మరి ముఖ్యంగా వంతెన కూలిపోయే సీన్ కోసం భారీగా డబ్బులను ఖర్చు పెట్టి ఆ సీన్ ను చాలా రిచ్ గా గ్రాఫిక్స్ లో చేశారు. కానీ అది మాత్రం సినిమాకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అది గ్రాఫిక్స్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఇక మహేష్ బాబు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే పేపర్ మీద రాసుకున్నప్పుడు ఉన్న దమ్ము, స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు మాత్రం కనిపించలేదు.ఇక డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా విషయం లో ఇలాంటి కొన్ని మిస్టేక్స్ అయితే చేశాడు. అందువల్లే ఈ సినిమా ఫ్లాప్ అయింది…