https://oktelugu.com/

Rajasekhar : రాజశేఖర్ ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే ఇప్పడు చిరంజీవి, బాలయ్య ల పక్కన నిలబడేవాడు…

ఒకప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయిన కూడా ఇప్పుడు కూడా వాళ్ళు స్టార్ హీరోలుగా నిరూపించుకోవాలి. లేకపోతే మాత్రం వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోవడం పక్క అనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : August 4, 2024 / 08:57 AM IST
    Follow us on

    Rajasekhar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న హీరో రాజశేఖర్…కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ‘అంకుశం ‘ సినిమాతో ఒక్కసారిగా భారీ హిట్ కొట్టి స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఇక ఈ సినిమా తర్వాత కూడా చాలా మంచి సినిమాలను చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నాడు. ఇక అప్పటి స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో సైతం పోటీపడుతూ తన సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో రాజశేఖర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు… ఇక అదే సమయంలో రాజశేఖర్ కూడా ఇండస్ట్రీలో ఈ నలుగురు స్టార్ హీరోలతో పాటు సమానంగా ఎదుగుతున్నాడనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక అదే సమయంలో ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ వల్లే ఆయన సినీ కెరియర్ స్టార్ హీరో రేంజ్ కి చేరుకోలేకపోయింది. నిజానికి ఆయన షూటింగ్ స్పాట్ కి చాలా లేటుగా వచ్చేవాడని చాలామంది దర్శకులు చెబుతుంటారు. ఇక ఈ విధంగా తనకు నచ్చిన సీన్లని ఆ సినిమాలో ఇన్ క్లూడ్ చేయమని దర్శకులతో చెప్పేవాడట. లేకపోతే వాళ్ళతో వాదించేవాడు అంటూ మరి కొంతమంది దర్శకులు కూడా ఆయన గురించి చెప్పడం విశేషం…

    ఇక మొత్తానికైతే ఆయన ఇలాంటి బిహేవియర్ ను కలిగి ఉండడం వల్లే చాలా మంది దర్శకులు రాజశేఖర్ తో సినిమా ఎందుకు అంటూ ఆయన ప్లేస్ ను బాలయ్య బాబు, వెంకటేష్ లతో రీప్లేస్ చేసేవారు. అందుకే రాజశేఖర్ చేయాల్సిన చాలా సినిమాల కథలను వాళ్ళకి చెప్పి వాళ్లతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకునేవాడు. ఇక ఈ రకంగా ఆయనకు సినిమా కెరియర్ అనేది చాలా వరకు తగ్గుకుంటూ వచ్చింది. ఇక అందులో భాగంగానే చాలా మంది స్టార్ డైరెక్టర్లు చెప్పిన కథలను కూడా ఆయన సరిగ్గా జడ్జ్ చేయలేక ఆ సినిమాలను వదులుకున్నాడు.

    అందుకే ఆయన తన ఎంటైర్ కెరియర్ లో మీడియం రేంజ్ హీరో దగ్గరే ఆగిపోయాడు. నిజానికి శంకర్ వచ్చి జెంటిల్మెన్ కథ చెప్తే రాజశేఖర్ ఆ కథను రిజెక్ట్ చేశాడు. ఫలితంగా శంకర్ ఆ సినిమాను అర్జున్ తో చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళంలో తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఇక టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా ఎదిగిన బి గోపాల్ సైతం రాజశేఖర్ తో రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ రాజశేఖర్ ఆ కథను కూడా రిజెక్ట్ చేయడంతో ఆయన బాలయ్య బాబుతో ఆ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ను కూడా సొంతం చేసుకున్నాడు…

    ఇలా రాజశేఖర్ తన బిహేవియర్ వల్ల గాని, సినిమాల జడ్జిమెంట్ విషయంలో కానీ రాంగ్ స్టెప్ వేయడం వల్లనే ఆయన స్టార్ హీరో రేంజ్ కు వెళ్లలేకపోయాడు. ఇక దాని ఫలితంగానే ఆయన స్టార్ హీరోగాఎద్గలేక మీడియం రేంజ్ హీరోగా మిగిలిపోయాడు. ఇంక తన సినిమాలు ఒక కేటగిరీ ప్రేక్షకులకు మాత్రమే నచ్చేవి. అందువల్లే ఆయన అందరిని అలరించలేకపోయాడు ఇప్పుడు ఆయనకు మార్కెట్ అనేది లేకపోవడంతో హీరోగా సినిమాలను చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…