https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..? ఆయన ఆ పాత్రలో నటిస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే…

ప్రపంచం లో ఉన్న చాలా మంది హీరోలు ఏదో ఒక క్యారెక్టర్ లో బాగా నటించి మెప్పిస్తారు. కానీ కొందరు హీరోలు మాత్రమే డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పిస్తారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 4, 2024 / 09:05 AM IST
    Follow us on

    Allu Arjun : సినిమా ఇండస్ట్రీ లో కొంతమందికి మంచి విజయాలు దక్కుతూ ఉంటాయి. మరి కొంతమంది కి మాత్రం ఎన్ని సినిమాలు చేసిన కూడా సరైన సక్సెస్ అయితే దక్కదు. అందుకే వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక ఇంకొంతమంది మాత్రం వాళ్ళు స్టైలిష్ గా కనిపిస్తూ యూత్ ను అట్రాక్ట్ చేసే సబ్జెక్ట్ లను ఎంచుకొని సక్సెస్ లను సాధిస్తుంటారు. ఇక అల్లు అర్జున్ కూడా ఇదే తరహాలో ఆర్య సినిమాతో యూత్ లో మంచి పాపులారిటి ని సంపాదించుకున్నాడు. నిజానికి గంగోత్రి సినిమాతో తను ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఆ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు అయితే రాలేదు. ఇక ఆ తర్వాత చేసిన ఆర్య సినిమాతో ఒక్కసారి భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆ సినిమాలోని పాటలకు ఆయన చేసే డ్యాన్స్ కి గాని, ఆయన చెప్పిన డైలాగులకి గానీ యూత్ మొత్తం ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఇక ఆర్య నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు పుష్ప 2 వరకు ఒకే రేంజ్ లో కొనసాగుతుంది… ఇక అల్లు అర్జున్ ఒక క్యారెక్టర్ కోసం ఎంతలా కష్టపడతాడో మనందరికీ తెలిసిందే. ఇక ఇంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమాలోని క్యారెక్టర్ కోసం ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి అయిన సరే వర్కవుట్ చేస్తూ ఆ క్యారెక్టర్ కు ఒక ఐడెంటిటీ తీసుకొచ్చేవాడు.

    ఇక ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం పోటీ పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన సుకుమార్ తో చేస్తున్న పుష్ప 2 సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు… ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు మంచి సినిమాల్లో బెస్ట్ క్యారెక్టర్స్ పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తన డ్రీమ్ రోల్లో నటించడానికి ఆయన ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు. అది ఏంటి అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సినిమా మొత్తం కనిపించి ఆ సినిమాలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటికి సొల్యూషన్ కనుక్కుంటూ ఒక్కొక్క చిక్కు ముడిని విప్పుతూ సినిమా మీద ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగిస్తూ మొదటి నుంచి చివరి వరకు ఆయన అభిమానులను తన అటెన్షన్ లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇక ఆ ఉద్దేశ్యంతోనే ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.

    ఇక దానికి సంబంధించిన కొన్ని కథలను విన్నప్పటికీ వాళ్ళు చెప్పిన కథలు ఆయనకి పెద్దగా నచ్చకపోవడంతో ఆ సినిమాలను చేసే ఆలోచనను మానుకున్నాడట…కానీ ఎప్పటికైనా కూడా అలాంటి ఒక పాత్రలో నటించి ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకుంటాను అని తన స్నన్నిహితుల దగ్గర ఎప్పుడూ చెబుతూ ఉంటారట. ఇక మొత్తానికైతే పుష్ప 2 సినిమాతో బన్నీ ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది…

    ఇక ఎప్పుడైతే ఆయన ఒక సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడో అప్పటినుంచే ఆయనకి సక్సెస్ అనేది తన బ్రాండ్ గా మారిపోయింది. అందుకే ఆయనకి ఇప్పుడు తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో భారీ అభిమానులనైతే సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాతో తను ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తే మాత్రం ఆయన స్టార్డమ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ కి వెళ్ళిపోతుందనే చెప్పాలి…