Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా జక్కన్నగా పేరుగాంచిన రాజమౌళి సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన బాహుబలి సినిమా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనను స్టార్ డైరెక్టర్ల లిస్టులో మొదటి స్థానంలో నిలిపింది. మరి మొత్తానికైతే జక్కన్న చేస్తున్న ప్రతి ప్రాజెక్టు మీద అందరికీ విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఎందుకంటే ఆయన సినిమా తీయడానికి టైమ్ తీసుకుంటాడు. కానీ ఒక్కసారి సినిమా చేశాడు అంటే మాత్రం అది అప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాస్తుందనే చెప్పాలి. ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం. ఇక ఎప్పటికప్పుడు తన సినిమా స్టాండర్డ్ ని మార్చుకుంటూ ప్రేక్షకుడి యొక్క ఇష్టాలను తెలుసుకొని వాళ్లకు నచ్చిన సినిమాలను చేయడానికి రాజమౌళి ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అందుకే జక్కన్న సినిమా తీయడంలో లేట్ అయినప్పటికీ ఆయన నుంచి వచ్చే ఔట్ పుట్ మాత్రం ప్రతి ప్రేక్షకుడిని సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది. ఇక ఇప్పటికే బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో పాన్ ఇండియాలో తన సత్తాను నిరూపించుకున్న రాజమౌళి ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఇండస్ట్రీ మీదనే దృష్టి పెట్టాడు.
ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో దాదాపు 3 వేల కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాలని జక్కన్న ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. ఒక్కసారి జక్కన్న ప్లాన్ వేశారంటే అది ఫెయిల్ అయిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రణాళికను కూడా సక్సెస్ ఫుల్ గా నిలపాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 1200 కోట్లతో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమా 3000 కోట్ల కలెక్షన్లు కనక రాబట్టినట్టైతే ఇండియాలోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్టుగా ఈ మూవీ ఒక భారీ రికార్డ్ ను సైతం సొంతం చేసుకుంటుంది… ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కూడా 3000 కోట్ల కలెక్షన్లు రాబడుతుందంటూ ఆయన రీసెంట్ గా ఒక ప్రకటన అయితే ఇచ్చారు. మరి ప్రశాంత్ నీల్ రాజమౌళి ఇద్దరి మధ్య భారీ పోటీ అయితే ఉండనుంది.
మొత్తానికైతే ప్రశాంత్ నీల్ సినిమాలు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంటాయి. కానీ రాజమౌళి సినిమాలు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే అందులో విజువల్ వండర్ ని ఎమోషన్స్ ను ఆడ్ చేసి ముందుకు తీసుకెళ్తుంటాడు. కాబట్టి రాజమౌళి సినిమా ముందు వేరే దర్శకుల సినిమాలు నిలబడుతాయా అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చకు తెర లేపుతుంది…