Homeఎంటర్టైన్మెంట్Maa Nanna Superhero Trailer: మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రివ్యూ: ఏడిపించేసిన సుధీర్...

Maa Nanna Superhero Trailer: మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రివ్యూ: ఏడిపించేసిన సుధీర్ బాబు, తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ!

Maa Nanna Superhero Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు కమిటెడ్ యాక్టర్. సినిమా సినిమాకు వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తాడు. కొత్త కథలతో ప్రేక్షకులను పలకరిస్తారు. సుధీర్ బాబు పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటిపోయింది. అయినా ఆయనకు బ్రేక్ రాలేదు. ఆయన చేస్తున్న ప్రయోగాలు ఫలితం ఇవ్వడం లేదు, ఆయన గత చిత్రం హరోంహర పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఫలితం ఇవ్వలేదు.

ఈసారి ఆయన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటించిన మా నాన్న సూపర్ హిట్ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రానికి అభిలాష్ కన్కార దర్శకుడు. అభిలాష్ తెరకెక్కించిన లూజర్ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. మా నాన్న సూపర్ హీరో చిత్రంతో ఆయన సిల్వర్ స్క్రీన్ పై అదృష్టం పరీక్షించుకోనున్నాడు.

ఇక మా నాన్న సూపర్ హీరో… తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ. కొడుకుగా సుధీర్ బాబు, తండ్రిగా సాయాజీ షిండే నటించారు. సాయి చంద్ ఓ కీలక రోల్ చేశాడు. సమస్యల్లో ఇరుక్కున్న తండ్రిని కాపాడుకునేందుకు కొడుకు చేసిన ప్రయాణమే ఈ చిత్రం. సహజీ షిండే ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన పెద్దగా చిత్రాలు చేయడం లేదు. చాలా కాలం అనంతరం ఆయనకు స్క్రీన్ స్పేస్ ఉన్న ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. అంత చేస్తున్నా.. కొడుకును ఇష్టపడని తండ్రిగా సాయాజీ పాత్ర ఉంది.

సినిమాలో కొన్ని సన్నివేశాలు ఏడిపించేస్తాయి అనడంలో సందేహం లేదు. అంత లోతుగా దర్శకుడు తీర్చిదిద్దాడు. తండ్రి-కొడుకుల ఎమోషనల్ జర్నీ బాగుంది. మా నాన్న సూపర్ హీరో మూవీ అక్టోబర్ 11న విడుదల కానుంది. సుధీర్ బాబుకు జంటగా ఆర్నా నటిస్తుంది. మ్యూజిక్ జే క్రిష్ అందిస్తున్నారు. వి సెల్యులాయిడ్ బ్యానర్ లో సునీల్ బలుసు నిర్మిస్తున్నాడు. మరి చూడాలి మానాన్న సూపర్ హీరో మూవీ ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. ట్రైలర్ చివర్లో సాయి చంద్… మహేష్ బాబు పేరు నీకు సూట్ కాలేదని సుధీర్ బాబుతో సాయి చంద్ అనడం బాగుంది.

 

Maa Nanna Super Hero Trailer | Sudheer Babu | Sayaji Shinde | Sai Chand | Abhilash Kankara

Exit mobile version