Ram Charan-Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ తనయుడిగా వచ్చిన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ అండతోనే ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ స్టార్ హీరోగా అవతరించిన తర్వాత అల్లు ఫ్యామిలీ అంటూ సపరేట్ గా తనకంటూ ఒక ట్యాగ్ తగిలించుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు ఫ్యామిలీల మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉంటూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ తెలియజేస్తూ ఎవరికి వాళ్లు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమను చూపిస్తూ మేమంతా ఒక్కటే అని చాటి చెబుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి డ్యాన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్న నటులు కొంతమంది మాత్రమే ఉన్నారు. అందులో రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరూ ఉంటారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అనే దాని మీద చాలా రోజుల నుంచి చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ వాళ్ళ గ్రేస్ కి తగ్గట్టుగా బాగా డాన్స్ చేస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళలో ఎవరు బెస్ట్ ఎవరు అనే విషయాన్ని మనం చెప్పలేము… ఎందుకంటే ఎవరి స్టైల్ లో వాళ్లు పర్ఫెక్ట్ మూమెంట్స్ వేస్తూ ప్రేక్షకులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్లలో ఎవరు నెంబర్ వన్ అనేది మనం పర్ఫెక్ట్ గా చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి.
ఎందుకంటే ఎవరి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ డాన్స్ లో వేరియేషన్స్ అయితే చూపిస్తారు. డిఫరెంట్ గా ఉండే మూమెంట్స్ ని వేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఒక్కో పాటకి ఒక్కో రిధమ్ ఉండేలా డ్యాన్స్ ను కంపోజ్ చేయించుకొని మరి స్టెప్పులు వేస్తూ ఉంటారు.
దానికోసం వాళ్ళు చాలా బాగా కష్టపడుతూ బెస్ట్ ఔట్ పుట్ రావడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందువల్లే వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ గా నిలూస్తారనేది చెప్పడం కష్టం…ఇక వీళ్ళ మధ్య ఎప్పటికప్పుడు పోటీ అయితే ఉంటుంది. అందువల్లే ఒకరిని మించి మరొక డ్యాన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ అనేది చెప్పడం కష్టం కానీ ఇద్దరు బెస్ట్ డాన్సర్లు అని చెప్పడం మాత్రం ఉత్తమం…