Sai Pallavi : సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలతో సరిసమానమైన ఇమేజి ని సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సాయి పల్లవి పేరు ముందు వరుసలో ఉంటుంది. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తూ యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకుంది. అద్భుతమైన నటనతో పాటు, డ్యాన్స్ లో కూడా ఈమె సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 అని నిరూపించుకుంది. ఇక క్రేజ్ విషయానికి వస్తే ఈమెని లేడీ పవర్ స్టార్ తో పోలుస్తుంటారు అందరూ. అంటే మగవాళ్ళతో ఆయనకీ ఎలాంటి క్రేజ్ ఉందో, ఆడవాళ్ళలో ఈమెకి అలాంటి క్రేజ్ ఉందని అర్థం. ఈమె ఒక సినిమాకి సంతకం చేసిందంటే, కచ్చితంగా ఆ సినిమాలో ఎదో విషయం ఉందని ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయిపోతారు. అలాంటి బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకుంది.
అయితే సాయి పల్లవి ముక్కుసూటి మనిషి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఏదైనా తన నచ్చకపోతే ముఖం మీదనే చెప్పేస్తుంది. అయితే ఈమెపై సోషల్ మీడియా లో ప్రచారమయ్యే కొన్ని ఫేక్ ప్రచారాలను చూసి, అనేక సందర్భాలలో చిరాకు పడిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఆమె చాలా ఘాటుగా రియాక్షన్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఆమె రణబీర్ కపూర్ తో కలిసి హిందీ రామాయణం లో నటిస్తుంది. సీత పాత్ర పోషిస్తున్న కారణంగా ఈమె ఎంతో నిష్ఠగా మాంసాహారం కి దూరంగా ఉంటుందని, కేవలం వెజిటేరియన్ ఫుడ్ ని మాత్రమే తింటుందని, తనతో ఒక ప్రత్యేకంగా ఒక వంటవాడిని తీసుకొచ్చి, అతనితో వంట చేయించుకొని తింటుందని ఒక ప్రముఖ మీడియా ఛానల్ ప్రత్యేకించి ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై సాయి పల్లవి చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘నాపై సోషల్ మీడియా లో పలు వెబ్ సైట్స్ చేసే ఫేక్ ప్రచారాలను చూసి చూసి విసిగిపోయాను. వీటిపై స్పందించడానికి కూడా నాకు మనసు వచ్చేది కాదు. చేసినన్ని రోజులు ఫేక్ ప్రచారం చేసుకొని వాళ్ళకే విసుగొచ్చి ఆపేస్తారులే అనుకున్నాను. కానీ వారిలో ఎలాంటి మార్పు కనపడడం లేదు. ఇక నాలో సహనం నశించింది. ఇక మీదట సోషల్ మీడియా లో ఎవరైనా నాపై ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తే లీగల్ నోటీసులను అందించి, వాళ్ళను జైలుకు పంపిస్తాను’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. అయినా సాయి పల్లవి పై గతంలో ఇంతకంటే ఘోరమైన రూమర్స్ వచ్చాయి. వాటిపై ఈమె ఈ రేంజ్ ఫైర్ లో చూపించి ఉండుంటే బాగుండేది, ఆమె గురించి తప్పుగా ఏమి రాయలేదు కదా, సీత లాంటి దేవత పాత్ర పోషిస్తున్నప్పుడు ఇలాంటివి అనుసరించడం మంచిదే, కానీ సాయి పల్లవి ఎందుకు అంత రియాక్షన్ ఇచ్చింది పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.